నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 105వ సినిమా రూలర్. మరో ఆరు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై బాలయ్య అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన ఈ టీజర్ లో మాస్ మసాలా, యాక్షన్ అంశాలు దిట్టంగా జొప్పించినట్టు తెలుస్తోంది. బాలయ్య లుక్ కూడా డిఫరెంట్ గా ఉండడంతో అభిమానులు సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే.. బాలయ్యకు ఈ సినిమా పరీక్ష పెట్టబోతోందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. 

 

 

బాలయ్య సినిమా అంటే మాస్ అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మాస్ సినిమాకు పోటీగా అదేరోజు మరో టాలీవుడ్ సినిమా 'ప్రతిరోజూ పండుగే'.. హిందీ రీమేక్ 'దబాంగ్3' విడుదల కాబోతున్నాయి. సాయిధరమ్ తేజ్ సినిమా చాలా క్లాస్ స్టోరీతో వస్తోంది. కుటుంబ కథా చిత్రం కావడం, గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మించడం ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. సాయి ధరమ్ కు, మారుతి ఫ్లాపుల్లో ఉన్నారు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని తపనతో సినిమా తీసారంటున్నారు. హిందీ మూవీ దబాంగ్ సిరీస్ లో రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడీ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమాపై తెలుగులో కూడా క్రేజ్ ఉంది.

 

 

దీంతో ఈ రెండు సినిమాల ప్రభావం బాలయ్య సినిమాపై ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా లాస్ లో విడుదలవుతోందని, యూఎస్ లో ఫ్రీగా విడుదల చేస్తున్నారని కూడా అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.  సంక్రాంతికి బాలయ్య ఎన్టీఆర్ సిరీస్ సినిమాలు బోల్తా కొట్టడం కూడా ఎఫెక్ట్ చూపుతోందని సమాచారం. బాలయ్య పెర్ఫార్మెన్స్ కు తిరుగులేకపోయినా మిగిలిన రెండు సినిమాలతో పోటీ మాత్రం తప్పదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: