టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండబోతున్నారు నందమూరి బాలకృష్ణ.   ప్రముఖ దర్శకులు క్రిష్ తెరకెక్కించిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ మూవీతో బాలకృష్ణ తన వందవ సినిమా పూర్తి చేశారు. ప్రస్తుతం హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు.  ఈ నేపథ్యంలో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన  'రూలర్' మూవీ ఈనెల 20 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన లీరిక్స్, టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  ఈ మూవీలో బాలయ్య రెండు మూడు రకాల షేడ్స్ లో కనిపిస్తున్నారు.  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా.. డాన్ గా స్మార్ట్ లుక్ తో కనిపిస్తున్నాడు.  

 

ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే.. ఎమెషన్,  ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు బీభత్సమైన యాక్షన్ ఉండబోతున్నట్లు కనిపిస్తుంది. ఇక రూలర్ రిలీజ్ తర్వాత బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ మూవీలో నటించబోతున్నారు.  ఇటీవలే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కొత్త సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ ప్రై ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను మెయిన్ విలన్ గా, సోనాక్షి సిన్హాని హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.  

 

ఈమూవీలో బాలయ్య ద్విపాత్రాభినయం ఉండబోతుందట. కాగా, సీనియర్ హీరో శ్రీకాంత్ మరో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ ఇంతకు ముందు నాగచైతన్య ‘యుద్ధం శరణం’లో విలన్ గా నటించాడు. గతంలో శ్రీకాంత్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే.. తర్వాత హీరోగా మారారు. ప్రస్తుతం ఒకప్పటి స్టార్ హీరోలు విలన్ గా యూటర్న్ తీసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో జగపతిబాబు విలన్ గా నటిస్తూ బిజీగా మారారు. ఇప్పటికే బోయపాటి బాలయ్య కలయికలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే, వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: