కన్నడ స్టార్ యష్  నటించిన క్రేజీ చిత్రం కెజిఎఫ్.. ఈ చిత్రం విడుదల అయినప్పటి నుండి ఇప్పటివరకు సినిమా క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. అదే క్రేజ్ కొనసాగించాలని ఈ చిత్రానికి సీక్వెల్ గా మరో చిత్రం తెరకెక్కబోతుంది. ముందు సినిమా నేపథ్యంలోనే కొంచం కొత్త హంగులతో మరో సినిమా రూపొందుతుంది.  ఆ సినిమా ప్రేక్షల్లో మరింతగా గుర్తుండిపోయేలా చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ బాగా కష్టపడుతుంది 
 

దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుండి  తాజాగా ఓ పోస్టర్ విడుదల అయ్యింది. యువతను ఆకట్టుకున్న ఈ చిత్రం నుండి విడుదల అయినా ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్రం పై మరింత అంచనాలను పెంచుతుంది. కే జి ఎఫ్ ఒకటి. గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈమూవీ ప్రభంజనం సృష్టించింది.ఇప్పుడు కూడా అదే రేంజులో ఉండబోతుందని చిత్రయూనిట్ అంటున్నారు. 


అయితే, పాన్ ఇండియాగా విడుదలైన ఈ చిత్రం అన్ని భాషలలో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో రాఖీ భాయ్ గా చేసిన హీరో యష్ ఒక్కసారిగా నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నారు.కాగా ఈ మూవీకి సీక్వెల్ గా కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఇంచుముంచు ఒక కథనంతో తెరకెక్కుతుంది. మళ్ళీ  క్రేజీ హీరో యష్ నటిస్తున్నారు. 


ఇది ఇలా ఉండగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈనెల 21న సాయంత్రం 5:45 కి విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేసి తెలియజేశారు. అంతటి విజయం సాధించిన కేజిఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న కేజిఎఫ్ 2 చిత్రంలో రాఖీ భాయ్ లా యష్ లుక్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి పెరిగిపోయింది. ఇక బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కేజిఎఫ్ 2లో ప్రధాన విలన్ గా చేస్తున్నారు. ఇటీవలే ఆయనకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కేజిఎఫ్ సిరీస్ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: