నందమూరి నటసింహం బాలయ్య అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తూ ఈ సారీ పక్కా మాస్ సినిమాతోనే వస్తున్నాడు. అదేమంటే  ఈయన నటిస్తున్న రూలర్ సినిమా ట్రైలర్ ఇదివరకే రిలీజ్ అయ్యి ఎంతగా పాపులర్ అయ్యిందో తెలుసు. ఇదే కాకుండా  ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్.. టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు నందమూరి హీరో. బాలయ్యను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా చాలా కొత్తగా చూపించాడు దర్శకుడు కేయస్ రవికుమార్ అని అనుకుంటున్నారు ఈ టీజర్, ట్రైలర్‌ను చూసిన అభిమానులు.

 

 

ఇకపోతే ముఖ్యంగా ఆయన గెటప్‌కు ఫ్యాన్స్ నుంచి కిరాక్ రెస్పాన్స్ వస్తుంది. టీజర్‌లో కూడా ఈ గెటప్ హైలైట్ అయింది. మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు ఈ సీనియర్ హీరో.. ఇక తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతీ ఏడాది సంక్రాంతి బరిలో సత్తా చాటే బాలయ్య ఈ సారి అభిమానులకు సంక్రాంతిని కాస్త ముందుగానే తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

 

 

ఇకపోతే బాలకృష్ణ సరసన హాట్‌ బ్యూటీ సోనాల్‌ చౌహాన్‌, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్‌ రాజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ రోజు రూలర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ రోజు విశాఖలో జరుగుతున్న సందర్భంగా ఆ ప్రదేశమంతా బాలయ్య అభిమానులతో హోరెత్తుతుంది.. ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో నిరాశపరిచిన బాలయ్య రూలర్‌లో అభిమానులను అలరించాలని ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ ప్యాకేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించగా. బాలయ్యతో గౌతమిపుత్ర శాతకర్ణి,  జైసింహా సినిమాలకు పనిచేసిన సంగీత దర్శకుడు చిరంతన్‌ భట్‌ ఈ సినిమాకు కూడా సంగీతమందించడం విశేషం..

మరింత సమాచారం తెలుసుకోండి: