అల్లు అర్జున్- త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠ పురంబులో’ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఇంటర్నెట్ లో విడుదలైన సాంగ్స్ అదరగొట్టే రీతిలో రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేయడం తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ కూడా మైండ్ బ్లోయింగ్ క్లాస్ అండ్ మాస్ పర్ఫామెన్స్ తరహాలో ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇటువంటి తరుణంలో ‘అల వైకుంఠ పురంబులో’ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో బన్నీ పాల్గొనే విషయంలో కొంత డౌట్ అన్న టాక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వినబడుతుంది.

 

విషయంలోకి వెళితే ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఆ సినిమాలో అదిరిపోయే మాస్ క్యారెక్టర్ చేస్తున్నట్లు గంధపు స్మగ్లర్ గా మరియు లారీ డ్రైవర్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ నటిస్తున్నట్లు దీంతో ఆ సినిమా కోసం ఫుల్ చేంజ్ అవటానికి బన్నీ తన బాడీ తో పాటు జుట్టు మరియు గుబురు గడ్డంతో చేంజ్ అయ్యే పనిలో ప్రస్తుతం ఉన్న ట్లు దీంతో ‘అలా వైకుంఠపురం లో’ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనటం డౌట్ అన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. అయితే ప్రస్తుతం ‘అలా వైకుంఠపురం లో’ సినిమాలో తన పాత్ర కు సంబంధించి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న అల్లు అర్జున్.. బాడీ మరియు జుట్టు విషయంలో సరికొత్త మార్పులు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.

 

మొత్తం మీద అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం చాలా సస్పెన్స్ గా తన లుక్ ఉండాలని అల్లు అర్జున్ బయట ఎవరికీ కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇదిలా ఉండగా ‘రంగస్థలం’ తరహాలోనే అల్లు అర్జున్ సినిమా కూడా అటువంటి గ్రామీణ వాతావరణం టైప్ లోనే తీయాలని సుకుమార్ డిఫరెంట్ స్టోరీని ప్రస్తుతం రెడీ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ ఆర్య మరియు ఆర్య-2 సినిమాలు రావడం జరిగాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా పై అల్లు అర్జున్ అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: