వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ ప్రతీ సారి సంచలనాత్మక సినిమాలు చేస్తూ ఉంటాడు. ఆయన చేసే సినిమాల్లో కంటెంట్ కంటే కాంట్రవర్సీనే ఎక్కువ ఉంటుంది. ఆ కాంట్రవర్సీ స్థాయిని కూడా ఈ మధ్య మరింత పెంచాడు. ఈ మధ్య ఆయన తీసిన "అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు" సినిమా ఎంత వివాదాస్పదం అయిందో అందరికీ తెలుసు. ఆ సినిమా టైటిల్ మొదలుకుని రిలీజ్ వరకు ప్రతీ చోట వివాదామే.

 

మొదట ఈ సినిమా పేరును కమ్మ రాజ్యంలో కడప రెడ్లు గా పెట్టారు. అయితే ఆ పేరు కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందన్న కారణంగా రిలీజ్ కి ఒకరోజు ముందనగా సినిమా పేరును "అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు" గా మార్చారు. ఈ సినిమా ఈ నెల ౧౨ వ తేదీన విడుదల అయింది. అయితే ఈ సినిమాలో వైఎస్ ఆర్ సీపీ పార్టీ అధినేతని హీరోగా చూపించి, మిగతా ప్రతిపక్షం పార్టీ వారిని చులకనగా చూపించారని ఆరోపిస్తున్నారు.

 

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని కించపరిచే విధంగా సన్నివేశాలున్నాయని, అవి తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నయని అంటున్నారు. ఆ సన్నివేశాలు జనసేన పార్టీల వారిని తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. దీనితో జనసేన పార్టీ వారు రామ్ గోపాల్ వర్మ మీద వినూత్న రీతిలో నిరసనని ప్రదర్శించారు. వర్మ  చనిపోయినట్లుగా శ్రద్ధాంజలి బ్యానర్ ఏర్పాటు చేయడంతో పాటు ఒకింత పరుష పదాలతో ఆయను తిట్టడం జరిగింది. 

 

ఆ సంఘటనపై వర్మ స్పందిస్తూ, బాబు, లోకేష్, పవన్ వీరాభిమానులు సినిమా గురించి బ్యాడ్ పబ్లిసిటీ చేయడం ఆపి, ఆ మూవీని అర్థం చేసుకోవాలన్నారు. సదరు అభిమానులపై ప్రమాణం చేస్తూ ఎవరిని కించపరచడానికి నేను ఆ సినిమా చేయలేదని, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తీశానని చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: