యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వం లో ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ యాక్షన్ కమర్షియల్ మూవీ రూలర్. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ మరియు థియేట్రికల్ ట్రైలర్ సినిమా పై ప్రేక్షకుల్లో మరియు నందమూరి అభిమానుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. 

 

 గతం లో బాలకృష్ణ మరియు కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన జైసింహా సినిమా మంచి విజయాన్ని అందుకోవడం తో, ప్రస్తుతం వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా లో సీనియర్ నటి జయసుధ, భూమిక చావ్లా ప్రత్యేక పాత్ర ల్లో నటిస్తున్నారు.చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ని నిర్మాత సి.కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్నారు. 

 

కాగా బాలకృష్ణ మాస్ పోలీస్ ఆఫీసర్ గా మరియు డాన్ గా రెండు విభిన్న పాత్రల ను ఈ సినిమా లో పోషిస్తున్నట్లు సమాచారం. ఇక  ఈ ఏడాది ప్రథమార్థం లో బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఎన్నో అంచనాల తో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఘోరం గా బోల్తా కొట్టాయి. ఆ విధంగా అభిమానులను పూర్తిగా నిరాశ పరిచిన బాలకృష్ణ, ప్రస్తుతం తెరకెక్కుతున్న రూలర్ తో ఎంత మేర సక్సెస్ ని అందించి ఖుషి చేస్తారో వేచిచూడాలి. అన్ని కార్యక్రమాలు ముగించి సినిమాని క్రిస్మస్ కానుక గా ఈ నెల 20వ తారీఖున భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు....!!

 

సినిమా బాలయ్యకు ఏమా త్రం హిట్ ని అందిస్తుందో అన్న విషయం నందమూరి అభిమానులను కలచి వేస్తుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని చిత్రం పై భారీ అంచనాలను పెంచుతున్నాయి. రొమాంటిక్ బాయ్ లాగ బాలయ్య ఎంట్రీ ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: