బాలయ్య బాబు నటించిన 'రూలర్' త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా అయిన వెంటనే బాలయ్య బాబు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 'సింహ' మరియు 'లెజెండ్' లాంటి రెండు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ విజయాలు ఇవ్వటంతో బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ఇదే తరుణంలో డైరెక్టర్ బోయపాటి కూడా అయ్య బాబోయ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయం బాలయ్యతో సాధించాలని స్క్రిప్ట్ విషయంలో మరియు అదే విధంగా సినిమాలో నటించే నటీనటుల విషయంలో చాలా జాగ్రత్తలు ఇప్పటికే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమాలో బాలయ్య బాబుతో పాటుగా అదిరిపోయే గెటప్ లో హీరో శ్రీకాంత్ చేత చేయించే ఆలోచనలో బోయపాటి వున్నట్లు … ఈ సినిమాలో బాలయ్య బాబుకి విలన్ క్యారెక్టర్ చేయించడానికి అదిరిపోయే క్యారెక్టర్ శ్రీకాంత్ కి డిజైన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. గతంలో లెజండ్ సినిమాలో జగపతిబాబుకు విలన్ గా పాత్ర ఇచ్చి కొత్త కెరీర్ ఇచ్చారు. ఆ క్యారక్టర్ ఎంత క్లిక్ అయ్యిందంటే ఇప్పటికీ పూర్తి స్దాయి బిజిగా ఉన్నారు జగపతిబాబు. ఇప్పుడు బోయపాటి దృష్టి శ్రీకాంత్ పై పడిందిట. బాలయ్య సినిమాలో నెగిటివ్ రోల్ కోసం అడిగారట.

 

ఆ పాత్ర వినగానే శ్రీకాంత్ మారు మాట్లాడకుండా ఓకే చేసాడని వినికిడి. శ్రీకాంత్ లుక్ సైతం చాలా విభిన్నంగా ఉండబోతోందట. అందుకోసం శ్రీకాంత్ ...కష్టపడుతున్నారట. సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో మరో విలన్ అని సమాచారం. సినిమాలో సంజయ్ దత్ మరియు శ్రీకాంత్ స్నేహితులు అదేవిధంగా విలన్లు అని సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్ కంటే వీళ్లిద్దరూ వేసే ప్లాన్లు సినిమాకే హైలెట్ అని ఆ విధంగా విలన్ క్యారెక్టర్ ల విషయంలో బోయపాటి చాలా శ్రద్ధ చూపిస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: