వెంకీ మామ సినిమా థియేటర్లలో విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతున్నది ఈ  సినిమా. మరోవైపు మంచి వసూళ్లను కూడా రావడంతో పాటు వెంకటేష్  నాగచైతన్య కెరీర్లో ఓ మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ కాంబినేషన్ ఇప్పుడు అనుకున్నది కాదు. తన మనవడు చైతు కొడుకు వెంకటేష్ కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుందని రామ నాయుడు అనుకునేవారట. అయితే రామానాయుడు కల నెరవేర్చడానికి సురేష్ బాబు ఎన్నో ఏళ్లుగా మంచి కథ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటికి  వెంకీ మామ తో ఈ కాంబినేషన్ తెర మీదికి వచ్చి ప్రేక్షకులను అలరించడమే కాకుండా రామానాయుడు కల నెరవేరినట్లయ్యింది. కాగా ప్రస్తుతం ఈ సినిమా అన్ని  థియేటర్లో హౌస్ ఫుల్ గా దూసుకుపోతుంది. 

 

 అయితే దగ్గుబాటి వారసుడు అక్కినేని వారసుడు సినిమా తీశాడు అంటే రెండు కుటుంబాలకీ ప్రతిష్ఠాత్మకమైనదే  కదా. కానీ వెంకీ మామ సినిమా పట్ల మాత్రం అక్కినేని కుటుంబం అంతగా ఆసక్తి చూపుతున్నట్లు కనిపించటం లేదు . కనీసం వెంకీమామ సినిమా విడుదల విషయంలో కానీ మంచి విజయం వైపు దూసుకుపోతున్న విషయంలో కానీ అక్కినేని  ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం ప్రస్తుతం ప్రేక్షకుల్లో  ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా నాగార్జున హాజరు కాలేదు... ఈ సినిమా గురించి నాగార్జున ఒకటంటే ఒక ట్విట్ పెట్టారు.  అయితే అందులో కూడా చైతు పేరును ప్రస్తావించారు ...వెంకటేష్ పేరు మాత్రం ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో అక్కినేని కుటుంబం వెంకీమామ సినిమాకు ఎందుకు దూరంగా ఉంటుంది అనే ప్రశ్న  అభిమానుల్లో మొదలైంది . 

 

 అయితే అక్కినేని కుటుంబం దగ్గుబాటి కుటుంబం మధ్య మనస్పర్థలు ఉన్నాయా  అంటే అది కూడా లేదు. వెంకటేష్  నాగార్జున ఏ ఈవెంట్ కి  హాజరైన ఇద్దరూ కలిసి సందడి చేస్తారు . అయితే అసలు కారణం ఏమిటంటే.. వెంకీ మామ సినిమా కథ విషయంలో నాగార్జున కు కొన్ని అభ్యంతరాలు ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. వెంకీ మామ సినిమా కథ ప్రకారం తల్లిదండ్రులకు దూరమైన నాగచైతన్యను వెంకీ మామ తల్లి తండ్రి అన్ని అయి  చూసుకొని పెద్ద  చేస్తాడు. చివరికి ఒక ప్రయోజకున్ని  చేస్తాడు. మరి నిజజీవితంలో కూడా నాగార్జున.. వెంకటేష్ సిస్టర్ లక్ష్మి అనివార్య కారణాలతో విడిపోయి చైతుకు  దూరమైతే వెంకటేష్ చూసుకున్నారు. ఈ పాయింట్ వల్లే నాగార్జున వెంకీ మామ సినిమాలో జోక్యం చేసుకోవడం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: