బోయపాటి శ్రీను డైరక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీంకాత్ విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. లెజెండ్ సినిమాతో జగపతి బాబుని విలన్ గా మార్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో జగపతి బాబు ఫేట్ మార్చేశాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత శ్రీకాంత్ ను విలన్ గా చేస్తున్నట్టు తెలుస్తుంది.

 

100 సినిమాల్లో నటించిన శ్రీకాంత్ ఆల్రెడీ నాగ చైతన్య హీరోగా చేసిన యుద్ధం శరణం సినిమాలో విలన్ గా నటించిన విషయం తెలిసిందే. కాని ఆ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అందుకే మళ్లీ శ్రీకాంత్ కు మరో ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమాకు శ్రీకాంత్ విలన్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

 

హీరోగా దాదాపు ఫేడవుట్ అయిన శ్రీకాంత్ ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్న శ్రీకాంత్ ఇప్పుడు బోయపాటి ఆఫర్ తో మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. మరి నిజంగానే శ్రీకాంత్ ఈ ఆఫర్ తో కెరియర్ లో మళ్లీ పుంజుకుంటాడా లేదో చూడాలి. హీరోగానే కాదు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్న శ్రీకాంత్ బోయపాటి ఆఫర్ పై అంచనాలు పెంచుకున్నాడు.   

 

రూలర్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా బోయపాటి శ్రీను త్వరలోనే బాలయ్య సినిమా త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు. ఇదే కాకుండా ఇక శ్రీకాంత్ కూడా పర్మినెంట్ విలన్ గా టర్న్ తీసుకుంటాడని తెలుస్తుంది. బాలయ్య సినిమా తర్వాత జగపతి బాబుకి విలన్ గా వరుస అవకాశాలు వచ్చాయి. అదే దారిలో శ్రీకాంత్ కు కూడా అలాంటి అవకాశాలే వచ్చి క్రేజ్ తెచ్చుకుంటాడని అంటున్నారు. బోయపాటి ఆఫర్ తో నిజంగానే శ్రీకాంత్ ఫేట్ మారుతుందా లేదా అన్నది ఆ సినిమా వస్తేనే చెప్పగలం.      

మరింత సమాచారం తెలుసుకోండి: