ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్లు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతీ ఒక్క జంటకు తప్పనిసరిగా మారాయి. తమ ప్రేమ ప్రయాణానికి గుర్తుగా కుటుంబం మరియు స్నేహితులతో పంచుకోవడానికి ఈ ప్రీ-వెడ్డింగ్ షూట్ ఉపయోగపడుతుందని వారి నమ్మకం. సాధారణంగా ఈ ఫోటోషూట్లు ప్రేమలో ఉన్న వధువు మరియు వరుడుపై చిత్రీకరించబడతాయి. కొన్ని సార్లు దీనికి భిన్నంగా కొన్ని జంటలు తమ పెంపుడు జంతువులు, చిన్న పిల్లలను కూడా ఈ ఫోటోషూట్లో భాగస్వామ్యం చేస్తారు.

 

 

కేరళకు చెందిన నీవేడ్ ఆంటోనీ చుల్లికల్ మరియు అబ్దుల్ రెహిమ్ అనే ఇద్దరు వ్యక్తులు స్వలింగ సంపర్కులు వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు, ఈ సందర్బంగా స్వలింగ వివాహాలు ఇతర వివాహాల మాదిరిగానే ఉంటాయని సమాజానికి ఒక స్పష్టమైన మరియు సానుకూల సందేశాన్ని పంపాలని కోరుకున్నారు. 

 

 

త్వరలో వివాహం చేసుకోబోయే ఈ జంట వారి పెంపుడు కుక్కలు మరియు గినియా పందులతో కలిసి ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ చేసారు. తద్వారా తమ మధ్య ఎంత ప్రేమ ఉందో సమాజానికి చాటిచెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫోటోషూటును వందలాది సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసించారు. 

 

 

"మా ఇద్దరి వివాహం ద్వారా చెప్పదలచుకుంది ఏంటంటే, స్వలింగ వివాహాలు కూడా ఇతర వివాహాల్లాగే సాధారణ వివాహాలే, మీరు ప్రేమలో ఉన్నప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని వేచి ఉండకపోవటం మంచిదని గ్రహించగలరని నేను నమ్ముతున్నాను" అని నివేద్ ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

 

 

ఈ జంట బెంగళూరులో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం కానీ వివాహ తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఐదేళ్ల క్రితం ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు, 2018 లో సుప్రీంకోర్టు ఆర్టికల్ 377 ను పాక్షికంగా రద్దు చేసినప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వివాహం చేసుకోవాలనే వీరి నిర్ణయానికి వీరి కుటుంబాలు మద్దతు ఇవ్వలేదు, కానీ ఈ జంట పెళ్ళికి సోషల్ మీడియాలో ఎలాంటి వ్యతిరేకత రాలేదని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: