నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రూలర్. ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఈరోజు సాయంత్రం అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ వేడుకకు నందమూరి ఫ్యాన్స్ అంతా వేల సంఖ్యలో పాల్గొననున్నారు. జై సింహా తర్వాత బాలయ్య బాబు రవికుమార్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ రూలర్.

 

రూలర్ టైటిల్ తోనే గర్జిస్తున్న బాలయ్య బాబు ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక, భూమిక వంటి వారు నటిస్తున్నారు. ఈమధ్య రిలీజైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. బాలయ్య మరోసారి మాస్ మసాలా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

 

అయితే మొదటి నుండి ఈ సినిమాలోని బాలయ్య లుక్ చూసి విమర్శలు చేస్తూ నెగటివ్ కామెంట్స్ చేసిన వాళ్లకు ఈ సినిమా రిజల్ట్ ద్వారా సౌండ్ లేకుండా చేస్తాడని అంటున్నారు. బాలయ్య హిట్టు కొడితే ఆ సినిమా కలక్షన్స్ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. జై సింహాతో టార్గెట్ కొద్దిలో మిస్ అవ్వగా ఈసారి రూలర్ అసలు టార్గెట్ మిస్ అవ్వకుండా తెరకెక్కించాడు.

 

చిరంతన్ భట్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోతాయని తెలుస్తుంది. రూలర్ సినిమా బాలకృష్ణ కెరియర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య బాబు రెండు మూడు వేరియేషన్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గ్లామర్ షో తో పాటుగా కంటెంట్ కూడా పకడ్బందీగా ఉంటుందని తెలుస్తుంది. కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ పండుగని వారం ముందే తెచ్చేలా ఉంది రూలర్ మూవీ. ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు 

 

మరింత సమాచారం తెలుసుకోండి: