ప్రతి సంక్రాంతికి నందమూరి బాలయ్య బాబు ఏదో ఒక మూవీ రిలీజ్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టి సంక్రాంతి హీరో అనిపించుకుంటాడు. అయితే తాజాగా మాత్రం తమిళ డైరెక్టర్ 'జై సింహ' అనే సినిమా తీసిన  కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తాజాగా 'రూలర్' అనే సినిమా బాలయ్య బాబు చేయడం జరిగింది. అయితే ఈ సినిమా సంక్రాంతి సీజన్లో విడుదల అవుతుందని అందరూ భావించిన తరుణంలో డిసెంబర్ నెలలోనే విడుదల అవ్వటంతో అందరూ షాక్ తిన్నారు.

 

అయితే సినిమా లో బాలయ్య బాబు లుక్ చాలా దారుణంగా ఉండటంతో పాటు సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ఇంకా అనేక విషయాల్లో మైనస్ క్లుప్తంగా కనబడటంతో తాజాగా విడుదలైన టీజర్ సమయంలోనే సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు సినిమాపై పెట్టుకున్న అంచనాలను సినిమా రిలీజ్ కాకముందే వదిలేసినట్లు సినిమా టీజర్ విషయంలో వారు చేసిన కామెంట్లు బట్టి అర్థమవుతుంది. విషయంలోకి వెళితే రూలర్ సినిమా లో పెద్దగా విషయం లేదని టీజర్ బట్టి అర్థమవుతోందని బాలయ్య బాబు యాక్టింగ్ కూడా గత సినిమాల మాదిరిగానే ఉందని సొంత నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తాజాగా విడుదలైన టీజర్ పై స్పందించడం జరిగింది.

 

దీంతో 'రూలర్' సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంతంతమాత్రంగానే జరిగినట్లు వార్తలు వస్తున్న తరుణంలో మరో వారం రోజుల్లో సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల అయి పెట్టిన డబ్బులు వచ్చేస్తా చాలు అని నిర్మాత ఉంటున్న తరుణంలో తాజాగా విక్టరీ వెంకటేష్ మరియు నాగ చైతన్య ఇద్దరు కలిసి నటించిన వెంకీ మామ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో బాలయ్య బాబు రూలర్ మూవీ నిర్మాత సి.కళ్యాణ్ భయాందోళనలకు గురి అయినట్లు ప్రస్తుతం వెంకీ మామ సినిమా కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తున్న తరుణంలో ఇటువంటి టైం లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేని రూలర్ సినిమాని వారం రోజుల్లో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అన్న డైలమాలో ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. మొత్తం మీద బాలయ్య బాబు నటించిన 'రూలర్' సినిమా కి సీనియర్ హీరో వెంకటేష్ 'వెంకీ మామ' సినిమా చెమటలు పట్టిస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితులు బట్టి తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: