మెగా హీరోల్లో... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారశైలి కాస్త భిన్నంగా ఉంటుంది. ఎంత క్రేజ్ ఉన్నా సరే... ఆయన కుటుంబానికి ఎప్పుడు దూరంగానే ఉంటారు. కొన్ని కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండటం, అభిమానుల మీద కొన్ని సార్లు ఆగ్రహంగా వ్యాఖ్యలు చేయడం వంటివి అభిమానులను కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. చిరంజీవి ఇమేజ్ తో పైకి వచ్చినా సరే బన్నీ మాత్రం ఆయనకు దూరంగా ఉంటారని అంటూ ఉంటారు. రామ్ చరణ్ తో కూడా బన్నీ కలిసిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి.

 

తన సినిమాలు తాను చేసుకోవడమే గాని ఎక్కడా కూడా... కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా కనపడడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన వ్యవహారశైలి ఇబ్బందికరంగా ఉంటుంది. సాయితేజ్ డిసెంబ‌ర్ 20న ప్ర‌తిరోజూ పండగే చిత్రంతో వస్తున్నాడు. ఈ నెల 15న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. దీనికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వ‌స్తాడ‌ని అంటున్నారు. కాని బన్నీ మాత్రం తాను రావడం లేదని తాను బిజీ గా ఉన్నాను అని చెప్పాడట.

 

ఇది ఎంత వరకు నిజమో గాని ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాలలో దీనిపై చర్చ జరుగుతుంది. సాయి తేజ్ వెళ్లి ఆహ్వానించినా సరే బన్నీ మాత్రం రావడానికి ఇష్టపడటం లేదని టాక్. ఇది పక్కన పెడితే... ఇప్పుడు అతను కుటుంబానికి మరింత దూరంగా ఉంటున్నాడని సమాచారం. తన తండ్రి అల్లు అరవింద్ కి... రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమా నచ్చలేదట. వద్దని చెప్పినా సరే చెర్రీ కనీసం వినే ప్రయత్నం కూడా చేయలేదట.

 

ఈ విషయంలో బన్నీ కూడా జోక్యం చేసుకున్నా... రామ్ చరణ్ పెద్దగా వినలేదని సమాచారం. దీనితో ఆగ్రహంగా ఉన్న బన్నీ కుటుంబానికి మరింత దూరం జరిగాడని, కనీసం వారాంతంలో అందరూ కలిసినప్పుడు కూడా అతను రావడం లేదని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: