టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఇతర హీరోల అభిమానులు కూడా మహేష్ బాబు సినిమా కోసం ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీనితో ఆయన సినిమాకు మార్కెట్ కూడా భారీగానే ఉంటుంది. ఇక మహేష్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం నిర్మాతలకు పండగే... దీనితో ఆయనతో సినిమా చేసేందుకు వాళ్ళు ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మహేష్ తో సినిమాల కోసం పోటీ పడతారు.

 

అయితే వాళ్లకు మహేష్ భార్య నమ్రత చుక్కలు చూపిస్తున్నట్టు సమాచారం. సినిమా కు సంబంధించిన వ్యవహారాలూ అన్నీ కూడా ఆమెనే చూస్తుంద‌ట‌. సినిమా మొదలైన నాటి నుంచి విడుదల వరకు ఆమె పెత్తనం నడుస్తుంద‌ట‌. దీనితో మహేష్ తో సినిమా చెయ్యాలి అనుకున్న వాళ్ళు ముందు ఆమెతోనే మాట్లాడుతున్నార‌ని తెలుస్తోంది. వాళ్లకు ఇప్పుడు ఆమె అనేక షరతులు పెడుతున్నారట.

 

సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వద్దని ఇటీవల ఒక నిర్మాతతో నమ్రత చెప్పారట... కథలో ఉండాలని ఆ నిర్మాత చెప్పినా ఆమె వినలేదట. మహేష్ ఇద్దరు హీరోయిన్లతో సినిమాలు చాలా తక్కువ చేసారు. 2010 నుంచి విడుదలైన సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఎక్కడా కనపడలేదు. అదే విధంగా... సినిమా నిర్మాణంలో కచ్చితంగా తమ భాగస్వామ్యం ఉంటుందని చెప్పారట... అలాగే విదేశాల్లో షూటింగ్ ఎక్కువ రోజులు ఉండొద్దని చెప్పారట నమ్రత.

 

అలాగే సినిమా రివ్యుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పినట్టు సమాచారం.. ఇక ఇతర భాషల్లో మార్కెట్ తక్కువగా ఉందని అక్కడ సినిమాలు విడుదల చేయవద్దని కూడా ఆమె చెప్పడంతో నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారట. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ ఆమె జోక్యం ఎక్కువుగా ఉండ‌డంతో ఇప్పుడు మ‌హేష్‌తో సినిమాలు చేసేందుకు చాలా మంది నిర్మాత‌లు వెన‌క‌డుగు వేస్తున్న‌ట్టు టాక్‌..?

మరింత సమాచారం తెలుసుకోండి: