నటసింహం నందమూరి బాలకృష్ణ, కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రూలర్. అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం అయ్యింది. వైజాగ్ లోని ఎంజీఎం గ్రౌండ్స్ లోని వుడా పార్క్ లో జరుగుతున్న ఈ ఈవెంట్ కు బాలయ్య సూపర్ లుక్ తో హాజరయ్యారు.

https://mobile.twitter.com/Kamesh_Talluri/status/1205824065920999425

ప్రస్తుతం ఎంజీఎం గ్రౌండ్ లో అట్టహాసంగా జరుగుతున్న ప్రి రిలీజ్ ఈవెంట్ వేడుకను వీక్షిస్తున్న బాలకృష్ణ అభిమానుల 'జై బాలయ్య, జై బాలయ్య!' అంటూ నినాదాలు చేస్తున్నారు. బాలయ్య తో సహా చిత్ర బృందం, కొంతమంది ప్రముఖులు ఈ ఈవెంట్ లో సందడి చేయనున్నారు.

https://mobile.twitter.com/TrendsMokshu/status/1205823166276222977

అయితే రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎవరు అతిధిగా రాబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్ర షూటింగ్ నిమిత్తం యంగ్ టైగర్ ఎన్టీఆర్ విశాఖపట్నం లోనే ఉన్నారు. సో, బాలకృష్ణ అభిమానులంతా జూనియర్ ఎన్టీఆర్ వస్తారని అభిప్రాయపడుతున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రానికి సంబంధించిన వేడుకకు నటసింహం నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. అప్పట్లో.. ఈ బాబాయి, అబ్బాయి ఒకే వేదికపై కనిపించి అభిమానులను ఫుల్ ఖుషి చేశారు. ఇదే తరహాలో.. ఈరోజు సాయంత్రం రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఒకే వేదికపై కనిపించనున్నారని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.

https://mobile.twitter.com/rk1708199/status/1204745053253468160

ఇకపోతే.. ఈ సినిమా క్రిస్టమస్ పండుగ సందర్భంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమైంది. ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్ల. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలయింది. ‘ఒంటి మీద ఖాకీ యూనిఫాం ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా.. బయటకు వచ్చిన సింహంలా ఆగను.. ఇక వేటే..' అనే డైలాగ్ బాలయ్య అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

https://mobile.twitter.com/shreyasgroup/status/1205835149851549696

మరింత సమాచారం తెలుసుకోండి: