నట సింహం నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘రూల‌ర్’. రీసెంట్‌గా సినిమా టీజర్ ను విడుదలచేశారు చిత్ర బృందం. సినిమా టీజర్ చూసిన నందమూరి అభిమానులకు నిరాశే మిగిలిందని.. ఈ సినిమాలో పెద్దగా ఆకట్టుకునే అంశాలు కనబడటం లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా 'రూల‌ర్' సినిమా చేయకముందు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగక ముందు బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర ఎన్టీఆర్ బయోపిక్ ను 2 భాగాలుగా తెరకెక్కించారు. ఈ సినిమాకి సంబంధించి అప్పట్లో జరిగిన హడావిడి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా ఎలక్షన్ మూమెంట్ ఉండటం, మరోపక్క బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ విడుదల చేయటంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు బాలయ్య ఫ్యాన్స్ కూడా  ఎన్టీఆర్ బయోపిక్స్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు.

 

అయితే సినిమా విడుదలయ్యాక రెండు భాగాలకు దారుణంగా డివైడ్ టాక్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే మార్నింగ్  షోకే ప్లాప్ టాక్ రావడంతో నిరుత్సాహపడ్డాకున్నారు. కానీ ఈ సినిమాలో బాలయ్య లుక్ లో గానీ, అలానే  టీజర్లో ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో గత సినిమాల్లో మాదిరిగానే 'రూల‌ర్' లో అదే డైలాగ్ డెలివరీ బాలయ్య చెప్పడంతో సినిమాకి మైనస్ చాలా కనపడుతున్నాయని సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.

 

ఇక ఇంతగా నెగిటివ్ టాక్ ఉన్నా కూడా, ‘రూల‌ర్’సినిమాకి పోటీగా రెండు స్టార్ హీరోల సినిమాలు విడుదలవడంతో ఇంకా పెద్ద మైనస్ అని విశ్లేషకులు అంటున్నారు. ఇక అదే విధంగా 'రూల‌ర్' సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంతంత మాత్రంగానే జరిగినట్లు ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. అందువల్లే ఓవర్సీస్ రైట్స్ బాగా తక్కువ రేట్ కే ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఇక కొత్తగా వినిపిస్తున్న మాటేమిటంటే సినిమా రిలీజ్ అవకుండానే హిట్టా.. ఫ్లాపా అన్న సీరియస్ డిస్కర్షన్ ప్రేక్షకుల్లో నడుస్తోంది. ఇక్కడ ముఖ్యంగా బాగా మైనస్ అయింది బాలయ్య లుక్స్ అని చెప్పాలి. ఇక ట్రైలర్ లో ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో ఇప్పుడే ప్రేక్షకుల్లో అనాసక్తి మొదలైంది. మరి బాలయ్య నట విశ్వరూపం తో సినిమాని హిట్ చేస్తారా..లేక ప్రేక్షకులనుకుంటున్నట్టుగానే ఫట్ మనిపిస్తారా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: