టాలీవుడ్ కి ‘హ్యాపీ డేస్’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు నిఖిల్.  అంతకు ముందు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన నిఖిల్ ‘హ్యాపీ డేస్’  తో మంచి పేరు తెచ్చుకున్నాడు.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు కొన్ని ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.  కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించిన ‘స్వామి రారా’ మూవీలో హీరోగా నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు.  ఈ మూవీ నిఖిల్ కి అదృష్టాన్ని తీసుకు రావడమే కాదు... వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ, కేశవ లాంటి మూవీస్ తో మంచి విజయం అందుకున్నాడు. అయితే సక్సెస్ ఫుల్ గా సాగుతున్న కెరీర్లో ఒక్కసారే ఇబ్బందులు ఎదురయ్యాయి. కిర్రాక్ పార్టీ మూవీతో బారీ డిజాస్టర్ పొందాడు.  

 

ఆ తర్వాత నిఖిల్ నటించిన `అర్జున్ సురవరం` ఈ మద్య రిలీజ్ అయ్యింది.  అయితే ఈ మూవీ మొదట ముద్ర అనే పేరుతో రిలీజ్ చేయాలని అనుకున్నారు.. కానీ ఆ టైటిల్ వివాదం కావడంతో ‘అర్జున్ సురవరం’ అని మార్చరు.  ఈ మూవీ రిలీజ్ విషయంలో కూడా ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి.  ప్రతిసారి రిలీజ్ అనడం.. వాయిదా వేయడం తో ఒకదశలో ఈ మూవీ రిలీజ్ అవుతుందా కాదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. మొత్తానికి ఈ మూవీ రిలీజ్ అయ్యింది.. ఈ సినిమా 14 రోజుల్లో రూ.21.6 కోట్లను రాబట్టుకుంది.  ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడినప్పటికీ.. ఏదైనా మనమంచికే అన్నట్లు ఫైనల్ గా మంచి సక్సెస్ ను అందుకున్నాం.

 

14 రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.21.6 కోట్ల గ్రాస్ రాబట్టి థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. అయితే దీనికి కారణం ఒక్కరే అని చెప్పగలను.  ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి దేవుడిలా వచ్చి ప్రమోషన్ చేశారు. ఈ సినిమాకు తొలి ఆడియన్, రివ్యూవర్, ప్రమోటర్ చిరంజీవి గారే అని గర్వంగా చెబుతాను. విజయానికి రెండో కారణం సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసిన మీడియా. మూడో కారణం కోట్లు పెట్టినా రాని పబ్లిసిటీని తమ వర్డ్ ఆఫ్ మౌత్ తో మా సినిమాకు అందించిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: