ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ని రిపీటెడ్ గా చూస్తుంటాము. అది హీరో హీరోయిన్, దర్శకుడు-హీరో, దర్శకుడు-హీరోయిన్..ఇలా అనమాట. ఇక కొంతమంది దర్శకులకు కొంతమంది నటీనటులతో.. టెక్నిషియన్స్ తో కంఫర్ట్ ఉంటుంది.  అందుకే వారిని తమ సినిమాల్లో రిపీట్ చేస్తుంటారు. మాస్ సినిమాల స్పెషలిస్టు బోయపాటి శ్రీను కూడా అందుకు మినహాయింపు కాదు. ఆయన హీరోయిన్ కేథరిన్ ట్రెసాకు ఈమధ్య తన సినిమాలలో అవకాశాలు వరసగా ఇస్తువస్తున్నాడు.

 

కేథరిన్ కు మొదటిసారిగా బోయపాటి 'సరైనోడు' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. పేరుకు సెకండ్ హీరోయిన్ అయిప్పటికీ ఎంఎల్ఎ పాత్రలో నటించిన కేథరిన్ కే ఎక్కువ పేరు వచ్చింది. నిజానికి 'సరైనోడు' సినిమాకు అవకాశం ఇచ్చిన సమయంలో కేథరిన్ కు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేవు. ఆ సమయంలో 'సరైనోడు' కేథరిన్ కు మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఆ సినిమా తర్వాత బోయపాటి మరోసారి 'జయ జానకి నాయక' సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో అవకాశం ఇచ్చాడు. ఆ సాంగ్ కూడా ఈ బ్యూటికి బాగానే పేరు తెచ్చి పెట్టింది. ఇక తాజాగా బోయపాటి..కేథరిన్ మరో క్రేజీ ఆఫర్ ఇచ్చాడని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 

బోయపాటి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ఎన్.బి.కె106 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈమధ్యే ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరుపుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కేథరిన్ కు బోయపాటి అవకాశం ఇచ్చాడట.  నిజానికి కేథరిన్ కు తెలుగులో పెద్దగా ఆఫర్లే లేవు. విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' లో నలుగురు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తోంది. ఇది తప్ప చేతిలో మరో ఆఫర్ లేదు. ఈ సమయంలో హ్యాట్రిక్ ఫిలిం అయిన ఎన్.బి.కె106 కు ఛాన్స్ రావడం కేథరిన్ కు జాక్ పాట్ అని చెప్పాలి. మరి ఈ సినిమాతో అయినా కేథరిన్ కు మంచి బ్రేక్ దక్కుతుందా లేదా అనేది సినిమా హిట్ ఫ్లాప్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఇదే సినిమాలో బాలయ్య సరసన కీర్తి సురేష్ ని అనుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. మరి దీని గురించి ఇంకా క్లారిటి రాకముందే ఇప్పుడు కేథరిన్ పేరు తెరమీదకు వచ్చింది. మరి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తేగాని అసలు హీరోయిన్ ఎవరన్నది తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: