ఫేట్ ఎలా డిసైడైతే లైఫ్ అలా డిసైడ్ అవుతుంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్టుగా మనం అనుకునేది ఒకటి మన జీవితంలో జరిగేది ఇంకొకటి. మన జీవితంలోనే కాదు ఇది ప్రతి ఒక్కిరికి అనుభవ పాఠమే. ఇక హీరో శ్రీకాంత్ విలన్ అవ్వాలని సినిమాల్లోకి వచ్చాడు. కానీ అతన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోని చేసింది. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నెగిటివ్ రోల్స్ పోషించినా పూర్తి స్థాయి విలన్ గా మాత్రం కనిపించలేదు. యువ సామ్రాట్ అక్కినేని  నాగచైతన్య హీరోగా నటించిన `యుద్ధం  శరణం గచ్ఛామీ`లో విలన్ గా నటించినప్పటికి ఆ సినిమా ఫ్లాప్ అవడంతో శ్రీకాంత్ రోల్ పెద్దగా రీచ్ కాలేదు. అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో నెగిటివ్ రోల్స్ పోషించాడు గానీ.. విలన్ గా మాత్రం సెటిల్ కాలేదు. దీంతో కొన్ని దశాబ్ధాల పాటు శ్రీకాంత్ డ్రీమ్ మాత్రం పుల్ ఫిల్ కాలేదనే చెప్పాలి. ఈరోజు శతాధిక చిత్రాల హీరోగా రికార్డులకెక్కిన శ్రీకాంత్ కి నెరవేరని కోరిక తను ఫుల్ లెంగ్త్ విలన్ గా నటించాలనుకోవడం. 

 

అయితే తాజాగా శ్రీకాంత్ ఎప్పటి నుంచో కన్న కల నెరవేరబోతోందని తెలుస్తోంది. బోయపాటి రూపంలో జాక్ పాట్ తగిలిందని లేటెస్ట్ న్యూస్. నటసింహ బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమాలో విలన్ గా నటించే అవకాశం శ్రీకాంత్ ని వెతుక్కుంటూ వచ్చిందట. ఇప్పటికే బాలయ్య కు జోడీగా ఇద్దరు హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసారు. ఇక ముఖ్య విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని రంగంలోకి దింపుతున్నారు. మున్నాభాయ్ తో పాటుగా మరో విలన్ గా శ్రీకాంత్ ని తీసుకుంటున్నట్లు తాజా సమాచారం. 

 

విలన్ పాత్రకు బోయపాటి ఇచ్చే ప్రాధాన్యత ఎలాంటిదో తెలిసిందే. హీరోలకు ధీటుగా విలన్లను తీర్చిదిద్దుతాడు. సీన్ లో ఫైటర్ల క్యారెక్టర్లు కూడా అంతే బలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ కి ఇది మంచి అవకాశం అని చెప్పాలి. లెజెండ్ సినిమాతో జగపతి బాబులో విలనిజాన్ని బయటకు తీసిన బోయపాటి శ్రీకాంత్ కి అంతే మంచి అవకాశం ఇస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. జగ్గుభాయ్ పాత్ర తర్వాత జగపతి కెరీర్ పూర్తిగా టర్న్ తీసుకుంది. ప్రస్తుతం శ్రీకాంత్ కు హీరోగా అవకాశాలు లేని నేపథ్యంలో విలన్ గా గనుక క్లిక్కయితే మరో రకంగా పాపులర్ అయ్యో అవకాశం దక్కినట్టే. ప్రస్తుతం దర్శకులంతా విలన్ పాత్రలంటే బాలీవుడ్, కోలీవుడ్ నటులపైనే ఆధారపడాల్సి వస్తోంది. టాలీవుడ్ లో ప్రతిభ దాగి ఉన్నా.. మన దర్శకులు ఇక్కడున్న వాళ్ళ గురించి ఆలోచించకపోవడం ఇప్పుడు  విమర్శలకు తావిస్తోంది. లోకల్ ట్యాలెంటు వైపు చూస్తూ బోయపాటి మంచి ప్రయత్నమే చేస్తున్నారని భావించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: