నందమూరి బాలయ్య ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత యంగ్‌గా కనిపిస్తున్నాడు. దీనికి కారణం 2019లో వచ్చిన బాలకృష్ణ నటించిన సినిమాలు మిగిలిన జ్ఞాపకాలు కావచ్చూ. అదేమంటే బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు బాక్సాఫీస్‌ ముందు బోల్తా పడ్డాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 2019లో బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచాయి.

 

 

అందువల్ల రూలర్ చిత్రం ద్వారా తానేంటో నిరూపించు కోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు ఉన్నాడు. అందుకే ఈ సంవత్సరం చివరిన ఒక సక్సెస్ అయినా తన ఖాతాలో వేసుకోవాలని తహ తహలాడుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ నందమూరి ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

 

 

బాలయ్య మాస్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. సినిమా కూడా ఓ రేంజ్‌లో ఉంటుందని ఇప్పటికే అంచనా వేస్తున్నారు. ఇక ఈ రోజు అంటే డిసెంబర్ 14న విశాఖలోని ఎంజీఎం గ్రౌండ్స్, ఉడా పార్క్‌లో సాయంత్రం 5 గంటల నుంచి రూలర్ ప్రీ రిలీజ్ వేడుకను చాలా అట్టహాసంగా చేస్తున్నారు.

 

 

ఇక ఈ చిత్రాన్ని సీకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద సి.కల్యాణ్ నిర్మిస్తుండగా, కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్ లు డిజాస్టర్ ఆవడంతో రూలర్ తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని బాలయ్య కష్టపడుతున్న తీరుకు అభిమానులు జై కొడుతున్నారు.

 

 

ఇకపోతే ‘జైసింహా’ వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత బాల‌కృష్ణ, కె.ఎస్‌.ర‌వికుమార్‌, సి.క‌ల్యాణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై అందరిలో మంచి అంచ‌నాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్య్రక‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్..

 

 

ఇకపోతే బాలయ్య కొత్త లుక్ చూస్తుంటే ఇప్పుడున్న హీరోలు ఏ వయస్సులోనైనా హీరో అంటే ఇలా ఉండాలని అనుకునేలా తయారయ్యాడు అని అనుకుంటున్నారు సినీ వర్గానికి చెందిన కొందరు. నిజమే కదా బాలకృష్ణసినిమా కోసం పడ్డ కష్టం ఆయన యంగ్ లుక్ లో కనిపిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: