టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ మరియు ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. ఇక ఈ సినిమా నుండి 'హి ఈజ్ సో క్యూట్' అనే పల్లవితో సాగె మూడవ సాంగ్ ని సోమవారం యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా భరత్ అనే నేను, మహర్షి సినిమాల సూపర్ హిట్స్ తో మంచి ఊపుమీదుండగా, 

 

మరొకవైపు అనిల్ రావిపూడి కూడా కెరీర్ పరంగా ఇప్పటివరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేకపోవడంతో ఈ సినిమాపై మరింతగా తారా స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఆమెతో పాటు సంగీత మరియు బండ్ల గణేష్ కూడా కొంత గ్యాప్ తరువాత వెండితెరపై కనపడనున్నారు. ఇకపోతే ఈ సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ కు ముహూర్తం కుదిరినట్లు టాలీవడ్ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమా ట్రైలర్ ని సరిగ్గా నూతన సంవత్సర కానుకగా జనవరి 1వ తేదీ సాయంత్రం రిలీజ్ చేయనుందట సినిమా యూనిట్. 

 

గతంలో రిలీజ్ అయిన టీజర్ లో రష్మిక కనపడకపోవడంతో ఆమె ఫ్యాన్స్ కొంత ఫీల్ అయ్యారు. అయితే త్వరలో రాబోతున్న ఈ ట్రైలర్ లో రష్మికకు సంబందించిన మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన రెండు సీన్స్ ఉన్నాయని, అవి చూస్తే తప్పకుండా ఆమె ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారని సరిలేరు యూనిట్ చెప్తోందట. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: