నందమూరి బాలయ్య బాబు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటించిన ‘రూలర్’ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20వ తారీఖు న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు మరియు టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వరుసగా రెండు సినిమాలు నందమూరి తారక రామారావు బయోపిక్ కి సంబంధించిన సినిమాలు ఫ్లాప్ అయినా తర్వాత బాలయ్య బాబు నటించిన ఈ ‘రూలర్’ పై అభిమానులు ఎంతగానో అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. సినిమాకి సంబంధించి సోనాలి చౌహాన్, వేదిక ఇద్దరు హీరోయిన్లు ఇప్పటికే హాజరవడం జరిగింది అదే క్రమంలో బాలయ్య బాబు కూడా హాజరయ్యారు.

 

విశాఖ తీరాన జరుగుతున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రెండు తెలుగు రాష్ట్రాల నుండి నందమూరి అభిమానులు ఈ వేడుకకు హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ‘రూలర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా లో అతి పెద్ద డైలాగ్ సినిమా వేదికపై బాలకృష్ణ చెప్పనున్నట్లు సమాచారం. గతంలో ఇదే విధంగా చాలా సినిమాలకు ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్య బాబు డైలాగ్ చెప్పిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఇదే తరుణంలో తాజాగా జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య బాబు తన స్పీచ్ తో పాటు సినిమాలో విలన్ ఎదురుగా ఉన్న సమయంలో బాలయ్య చెప్పే అతి పెద్ద డైలాగ్ ఈ వేదికపై చెప్పనున్నట్లు సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం.

 

ముఖ్యంగా ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ పాత్రలో బాలయ్య బాబు అదరగొట్టే యాక్షన్ ఫైట్లతో నటించినట్లు ఖచ్చితంగా బాలయ్యబాబు కెరియర్లో ‘రూలర్’ ఓ మైలురాయి సినిమాగా నిలిచిపోనున్నట్లు ఫిలింనగర్ లో వినపడుతున్న టాక్. మరోపక్క నందమూరి అభిమానులు ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించి బాలయ్య హిట్ ట్రాక్ ఎక్కాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో ప్రీ రిలీజ్ వేడుకకు రాని అభిమానులు ఆల్ ది బెస్ట్ బాలయ్య అంటూ విషెస్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: