పవర్ఫుల్ హీరోయిజానికి.. పంచ్ డైలాగ్ లకు కేరాఫ్ అడ్రస్ నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. సీనియల్ హీరో అయినప్పటికీ ఎక్కడ జూనియర్ హీరోలకు తీసిపోకుండా తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికీ జూనియర్ హీరోలకు సైతం సాధ్యంకాని రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ. హిట్టు  ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా  సినిమా అవకాశాలు దక్కించుకుంటూ... సత్తా చాటుతున్నారు. అయితే మొన్న వచ్చిన  ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడడంతో బాలకృష్ణ కాస్త అయోమయంలో పడ్డారు. ఎందుకంటే ఈ సినిమాల్లో  బాలకృష్ణ హీరోగానే కాదు నిర్మాతగా  కూడా పనిచేశారు. 

 


 అయితే ఇప్పుడు రూలర్  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నందమూరి బాలకృష్ణ. తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రూలర్ సినిమాతో మరోసారి నందమూరి బాలకృష్ణ తనదైన స్టైల్ యాక్షన్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే  విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.  ట్రైలర్ లో బాలకృష్ణ  తనదైన మార్క్ హీరోయిజాన్ని చూపించారు . అంతేకాదండోయ్ ఈ సినిమాలో సరికొత్త లుక్ తో  కనిపించబోతున్నాడు బాలకృష్ణ. ఇక ఈ సినిమాలో స్లిమ్ గా  కనిపించడానికి బాలకృష్ణ చాలానే కష్టపడ్డాడు. ఈ ఏజ్ లో కూడా ఈ సినిమా కోసం జిమ్ లో కసరత్తులు చేసి వెయిట్ కూడా తగ్గాడు . ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ చూస్తే మతి పోవాల్సిందే. బాలకృష్ణ లుక్ కు ముందు యువ హీరోలు కూడా పనికిరారేమో  అనిపిస్తుంది చూసిన ప్రేక్షకులకు. 

 


 సినిమా లో బాలయ్య రెండు గెటప్స్ లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఒకటి మాస్ గా  కనిపించే పోలీస్ పాత్రలో ఇంకొకటి సాఫ్ట్ గా మరో గెటప్ లో బాలయ్య రూలర్ సినిమాలో కనిపించబోతున్నారు.ఇక  బాలయ్య గెటప్ లు  చూసిన అభిమానులు అందరూ మరోసారి బాలయ్య భారీ హిట్టు  కొట్టడం కాయం అని నమ్మకంతో ఉన్నారు. ఇకపోతే  నందమూరి బాలకృష్ణ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాదండోయ్ బాలయ్య సినిమాలో జయసుధ భూమిక ప్రకాష్ రాజు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటుంది. విశాఖలో రూలర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: