ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వచ్చే శ్రీ రెడ్డి ఈ మధ్య కొంచెం తగ్గింది, ఈ మధ్యనే సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్బంగా రజనీకాంత్ గారు హ్యాపీ బర్త్ డే అని కామెంట్ పెట్టింది, ఇక దీపిక పడుకోన్ నటించిన చపాక్ ట్రైలర్ విడుదలైన సందర్బంగా చపాక్ ట్రైలర్ బాగుంది అంటూ శ్రీ రెడ్డి కామెంట్ చేసింది. ఎప్పుడూ నెగటివ్ గా కామెంట్స్ చేసే శ్రీ రెడ్డి ఇలా పాజిటివ్ కామెంట్స్ చెయ్యడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, కొందరు మాత్రం శ్రీ రెడ్డి మారుతోంది అని భావించారు.

 

 

ఇలా అనుకున్న కొద్ది గంటల్లోనే శ్రీ రెడ్డి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే శ్రీ రెడ్డి మరోసారి పవన్ ను టార్గెట్ చేసింది, అయితే ఈసారి నేరుగా పవన్ ను టార్గెట్ చెయ్యకుండా రేణు దేశాయ్ ను ఉద్దెశించి కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. తన సోషల్ మీడియా అకౌంట్లో "రేణు దేశాయ్ మీరు చాలా మంచి వారు, ఇప్పుడు మంచి జీవితాన్ని గడుపుతున్నారు, మీరు నరకం నుంచి బయటపడ్డారు" అంటూ కామెంట్స్ చేశారు.

 

 

నరకం నుంచి బయటపడ్డారు అంటూ కామెంట్స్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ నరకం అనుభవించారు అని నేరుగా చెప్పకుండా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు శ్రీ రెడ్డి. సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ కు శ్రీ రెడ్డి కి మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ జరిగిన తరువాత కూడా పీకే లాంటి ముగ్గురు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తులను కూడా ఎన్కౌంటర్ చెయ్యాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: