ఆమె టాలీవుడ్ టాప్ హీరోయిన్... అంతకుమించి ఒక గొప్ప నటి.. మిగతా హీరోయిన్లందరుకి  ఆమె ఒక ఇన్స్పిరేషన్.. పెళ్లి తర్వాత సినిమాలు చేయోచ్చు  అని నిరూపించిన సెన్సేషన్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ అక్కినేని వారి కోడలు సమంత. పెళ్లి తర్వాత హీరోయిన్ కెరియర్ కు చెక్ పడినట్టే అన్న వార్తలన్నింటినీ చెల్లా చెదురు చేస్తూ పెళ్లి తర్వాత కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్గా దూసుకు పోవచ్చు అని నిరూపించింది సమంత. ఇక నాగ చైతన్యతో పెళ్లి తర్వాత అక్కినేని కోడలిగా మారిన సమంత క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. పెళ్లి తర్వాత సమంతతో సినిమాలు చేయడానికి దర్శకులు పోటీ పడుతున్నారు కూడా. ఇక చేతి నిండా సినిమాలతో దూసుకు పోతుంది ఈ అమ్మడు. అటు ఫిట్నెస్ విషయంలో కూడా అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది సమంత. 

 


 ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడికి లక్కు  కూడా బాగానే కలిసొచ్చిందండోయ్ . ఏకంగా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. ఇక ఇప్పుడు లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కూడా చేస్తూ తన సత్తా చాటుతుంది  సమంత. ఇక సినిమాలో వరుస అవకాశాలు ఉన్నప్పటికీ వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేస్తుంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ 2 సీజన్ లో నటిస్తుంది. ఇప్పటికే వచ్చిన ది ఫామిలీ మెన్  సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. సినిమాలో మనోజ్  బాజ్పాయి  ప్రియమణి కీలక పాత్రలో నటించారు. 

 

 దీంతో ఫ్యామిలీ మెంబర్స్ సీజన్ టు లో నటించేందుకు సమంత రెడీ  అయిపోయింది. అయితే ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతోంది. తన కెరీర్ లోనే మొదటిసారి సమంత ఒక నెగిటివ్ పాత్రలో నటిస్తోంది. ఇదిలా ఉంటే సమంతకి టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. పెళ్లికి ముందే కాదు ఇప్పుడు కూడా బాలీవుడ్లో సినిమాలు చేయాలంటు  దర్శకనిర్మాతలు సమంతను కోరుతున్నారు. అయితే ఈ అమ్మడు మాత్రం ఇప్పటివరకు సౌత్ సినిమాలను దాటి వెళ్ళలేదు. ఇప్పుడు తాజాగా మరో హిందీ సినిమాలో ఈ అమ్మడు నటించాలని దర్శక నిర్మాతలు కోరుతున్నారు. యూటర్న్ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని అందులో సమంతానే  నటించాలని బాలీవుడ్ దర్శకనిర్మాతలు కోరారట. అయితే ఈ ఆఫర్ ని మాత్రం సమంత సున్నితంగా తిరస్కరించింది అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో సమంత పాత్రలో తాప్సీ ని సెలెక్ట్ చేసిందట చిత్రబృందం. కాగా  యు టర్న్ సినిమాలో సమంత నటనకు మంచి మార్కులు వచ్చినప్పటికీ కమర్షియల్గా మాత్రం ఈ సినిమా విజయం సాధించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: