నందమూరి బాలయ్య బాబు ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత నటించిన రూలర్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక తాజాగా విశాఖపట్టణంలో చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ ప్రియ రిలీజ్ వేడుకకు బాలయ్య బాబు మరియు అదేవిధంగా హీరోయిన్లు సోనాలి చౌహాన్, వేదిక ఇద్దరు హాజరయ్యారు. ఇదే తరుణంలో ఈ సినిమా అయిన వెంటనే బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్న డైరెక్టర్ బోయపాటి కూడా ఈ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కావడం జరిగింది.

 

ఈ సందర్భంగా బోయపాటి సినిమా గురించి మాట్లాడుతూ...బాలయ్య బాబు కి సరైన టైటిల్ కరెక్ట్ టైటిల్ ‘రూలర్’ అని తెలిపారు. ఈ క్రమంలో డైరెక్టర్ బోయపాటి వెనకాల నిర్మాత సి.కళ్యాణ్ బోయపాటి దగ్గర మైక్ లాక్కుని 'రూలర్' టైటిల్ అసలు బోయపాటి దేనని తెలిపారు. తర్వాత బోయపాటి మాట్లాడుతూ అవును ఈ టైటిల్ నాదే అని కొత్త విషయం బయట పెట్టాడు. ఈ టైటిల్ ఆల్రెడీ నేనే రిజిస్టర్ చేసి పెట్టానని బోయపాటి తెలిపారు. బాలయ్య బాబు హృదయాలని గెలుచుకోవడంలో రూలర్ అని ...ఎందుకు చెబుతున్నానంటే బాలయ్య బాబు ఒక క్యారెక్టర్ చేస్తే దానికి లొంగి పోతారని ఆ తర్వాత క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయితే ఆ క్యారెక్టర్ ని ఒంగో పెడతారు అని బోయపాటి తెలిపారు.

 

ఇదే క్రమంలో తన నెక్స్ట్ సినిమా బాలయ్య బాబుతో జనవరి నుండి మొదలు కానుందని ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ల విషయంలో అనేక పేర్లు మీడియాలో వస్తున్నాయి వాటన్నిటినీ నమ్మవద్దని సినిమా కి సంబంధించిన హీరోయిన్ విషయంలో నేనే క్లారిటీ ఇస్తానని...వస్తున్న వార్తలలో వాస్తవం లేదని బోయపాటి ఈ సందర్భంగా తెలిపారు. అన్ని విషయాలు కన్ఫామ్ అయ్యాక నేనే మీడియాకి చెబుతానని బోయపాటి చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: