ఎన్టీఆర్ నటవారసుడు నందమూరి బాలకృష్ణ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రూలర్ సినిమా. ఈ సినిమాపై అటు నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు ఎన్టీఆర్ కథానాయకుడు ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలతో బాలకృష్ణ ఖాతాలో రెండు ఫ్లాప్  సినిమాలు చేరడమే కాకుండా బాలకృష్ణ ఈ సినిమాలకు నిర్మాతగా కూడా వివరించడంతో బాలకృష్ణ అయోమయంలో పడిపోయారు. అటు బాలకృష్ణ అభిమానులు కూడా కాస్త డిసప్పాయింట్ అయ్యారు.అయితే  బాలకృష్ణ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా బాలకృష్ణ వద్దకు మాత్రం సినిమా నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ  రూలర్ సినిమాలో సరికొత్త లుక్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

 

 

 బాలకృష్ణ కెరీర్లోనే ఇప్పటి వరకు కనిపించని సరికొత్త లుక్ తో కేఎస్  రవికుమార్ దర్శకత్వంలో రాబోతున్న రూలర్ సినిమా లో కనిపించబోతున్నాడు బాలకృష్ణ. ఈ సినిమాలో రెండు గెటప్లలో బాలకృష్ణ యాక్షన్ చూపించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే బాలకృష్ణ మరోసారి తనదైన యాక్షన్ చేయడం కాయం అన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో జయసుధ భూమిక ప్రకాష్ రాజు లో నటిస్తున్నారు. అంతేకాదండోయ్ రూలర్ సినిమాలో బాలకృష్ణ సరసన ఏకంగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు.

 

 

 

 ప్రస్తుతం రూలర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్  జరుపుకుంటుంది. విశాఖ వేదికగా రూలర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రస్తుతం రూలర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ప్రీ  రిలీజ్ ఈవెంట్ మొదలు కాకముందే నందమూరి అభిమానులు అందరూ ఈవెంట్ జరిగే స్థలానికి వెళ్లి సందడి చేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు చూసి సంబరపడిపోతున్నారు. విశాఖ వేదికగా ఎంతోమంది అతిధుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇకపోతే బాలకృష్ణ రూలర్ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మామూలుగా అయితే బాలకృష్ణ తన సినిమాలను సంక్రాంతి బరిలో విడుదల చేస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు రూలర్లర్ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుండటంతో నందమూరి అభిమానులు అందరికీ సంక్రాంతి కాస్త ముందుగానే రాబోతుంది అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: