నందమూరి బాలకృష్ణ, కె.ఎస్ రవికుమార్ కాంబోలో వస్తున్న రెండవ సినిమా రూలర్. జై సింహా తర్వాత వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రూలర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో శనివారం సాయంత్రం అంగరంగ వైభగంగా జరిగింది. ఈ సినిమా ట్రైలర్ తో పాటుగా సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందించగా సినిమాలోని సంక్రాంతి సాంగ్ అదిరిపోయింది.

 

ఈ సాంగ్ లో ప్రత్యేకంగా రైతు పండించిన పంట ఇంటికొచ్చే పండుగ సంక్రాంతి అంటూ లిరిక్స్ అద్భుతంగా వచ్చాయి. ముఖ్యంగా తెలుగు వాడి సత్తా చాటేలా ఈ సాంగ్ ఉంది. మాములుగానే బాలకృష్ణ తన సినిమాల్లో తెలుగు జాతి.. తెలుగు భాషకు సంబందించి ప్రాధాన్యత ఉంచుతాడు. రూలర్ లో కూడా సంక్రాంతి పాట మరోసారి ప్రేక్షకుల మనసు గెలిచింది. 

 

చిరంతన్ భట్ ఈ సాంగ్ కు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్టు తెలుస్తుంది. బాలయ్య బాబు 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందించాడు. ఆ సినిమాకు చిరంతన్ భట్ మంచి మ్యూజిక్ అందిచినా తెలుగులో అవకాశాలు రాలేదు. అందుకే మళ్లీ బాలయ్య బాబే రూలర్ ద్వారా చిరంతన్ భట్ కు మళ్లీ తెలుగు సినిమా అవకాశం కల్పించాడు.

 

సినిమాలో అన్ని సాంగ్స్ సూపర్ అనేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. అయితే ఈ సంక్రాంతి పాట చూస్తుంటే ముందునుండి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కాని సంక్రాంతికి పోటీ ఎక్కువవడం వల్ల డిసెంబర్ కు షిఫ్ట్ అయ్యాడు. డిసెంబర్ 20న బాలయ్య రూలర్ గా వస్తున్నాడు. మరి రూలర్ గా బాక్సాఫీస్ ను రూల్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. నందమూరి ఫ్యాన్స్ మాత్రం సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: