స్వాతంత్య్ర సమరయోధుల కథల్ని తెరపైకి తీసుకువస్తే ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపు ఇవ్వడం అనే సత్సాంప్రదాయం ఒకప్పుడు ఉంది. అటు బాలీవుడ్ లో కొన్ని సినిమాలకు ఈ తరహా మినహాయింపులు ఇచ్చి కొంతవరకూ నిర్మాతల్ని ఆదుకోవడానికి ప్రయత్నాలు జరిగేవి. ఇంతకుముందు గుణశేఖర్ రుద్రమదేవి సినిమాకి చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోయినా.. కేసీఆర్ ప్రభుత్వం పన్ను మినహాయించడం తెలిసిందే. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని సినిమాలో ప్రతిబింబించినందుకు కేసీఆర్ ప్రభుత్వం ఈ సినిమాకి పన్ను మినహాయింపును ఇచ్చింది.

 

అయితే అదే తరహాలో సైరా-నరసింహారెడ్డి సినిమాకి ఏపీ ప్రభుత్వం తరపున అంతో ఇంతో అండ ఉంటుందని కొణిదెల కాంపౌండ్ భావించిన మాట వాస్తవం. పన్ను మినహాయింపు ఉంటే కొంతవరకూ నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉండేది. కానీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాం చరణ్ ఆవేదన చెందుతున్నారట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాయలసీమ వీరుడి కథ. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వీరుడి కథగా కీర్తి పొందినా లాభం లేకపోయింది. కనీసం ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వలేదు. పైగా జీఎస్టీ బాదుడు తప్పలేదు. కేవలం జీఎస్టీ రూపంలో నిర్మాత రామ్ చరణ్ 40 కోట్లు చెల్లించారట. పన్ను మినహాయింపు లేదు సరి కదా.. అంత పెద్ద మొత్తం జీఎస్టీ కట్టడం అంటే మాటలా? అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులే ఆదుకున్నారు. హిందీలో.. ఓవర్సీస్ లో ఆశించినది దక్కలేదు. దాంతో భారీగా నష్టాలు తప్పలేదు.

 

అయితే మార్కెట్ విశ్లేషకులు వేరొక కోణంలోనూ విశ్లేషిస్తున్నారు. ఫైనల్ గా సైరా లాభనష్టాలకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ఇంకా రావాల్సి ఉంది. నిర్మాత రామ్ చరణ్ ఖర్చు చేసినంతా తిరిగి వచ్చేసి ఉండొచ్చు.. సైరా లాభాలు తేలేకపోయినా నష్టాల్ని మిగిల్చి ఉండదుని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. సైరా సినిమాకి దాదాపు 280 కోట్ల మేర షేర్ వచ్చిందని ఇదంతా తెలుగు ప్రేక్షకుల ఆదరణతోనే సాధ్యమైందని రామ్ చరణ్ ఇంతకుముందు సక్సెస్ వేడుకలో తెలిపారు. హిందీ ప్రేక్షకులు ఆదరించకపోవడం నిరాశపరిచిందని అన్నారు. మరి ఇప్పుడు రాం చరణ్ తర్వాత ప్రాజెక్ట్స్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: