నందమూరి బాలయ్య బాబు సోనాలి చౌహాన్ మరియు వేదిక హీరో హీరోయిన్లుగా నటించిన 'రూలర్' సినిమా ప్రీ రిలీజ్ వేడుక విశాఖ నగరంలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నందమూరి అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. ముఖ్యంగా సినిమాలో బాలయ్య బాబు లుక్ గురించి స్టేజిపై ఎక్కిన ప్రతి ఒక్కరు ఈ వయసులో కూడా ఇంత అందంగా కనిపించడం అంటే అది బాలయ్య బాబుకు మాత్రమే సాధ్యమని ఆయన అందానికి సీక్రెట్ ఏంటో ఆయన తెలియజేయాలని బాలయ్య బాబు లుక్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ముఖ్యంగా సినిమాలో బాలయ్య బాబు చాలా పవర్ ఫుల్ రోలు కలిగిన క్యారెక్టర్ చేశారని ఈ సినిమా కచ్చితంగా విజయం సాధించడం మరియు బాలయ్య బాబు ఈ సినిమాతో సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారెంటీ అని సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ స్టేజిపై తెలపడం జరిగింది.

 

ఈ సందర్భంగా ఈ ప్రీ రిలీజ్ వేడుకకు హీరో రాజశేఖర్ తో పాటు మరియు సతీమణి జీవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో తాను వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు సపోర్ట్ గా ఉన్నది బాలయ్య బాబు అని...చాలా కుటుంబ మనిషి గా భావించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి తనని తన కెరీర్ని బాలయ్య బాబు సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా బాలయ్య బాబు నిజంగా రూలర్ అని… అది ఈ సినిమా నుండి కాదని చిన్ననాటి నుండి అని ఆయన తండ్రి నిజమైన రూలర్ అని అదే తత్వాన్ని బాలయ్య బాబు అలవర్చుకొని సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నరు అని.. అలాగే బాలయ్య బాబు వియ్యంకుడు చంద్రబాబు కూడా రూలర్ అని స్టేజిపై రాజశేఖర్ డైలాగ్ వేశారు.

 

ఇదే క్రమంలో సినిమా డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ పై కూడా పొగడ్తల వర్షం కురిపించారు హీరో రాజశేఖర్. అంతే కాకుండా ప్రతి సంక్రాంతికి బాలయ్య బాబు సినిమా రిలీజ్ చేసి ఆ పండగ సీజన్ ని తన సినిమాతో హిట్ కొట్టి ఏలుతారు కానీ రాబోయే సంక్రాంతికి ముందే రూలర్ సినిమా రిలీజ్ చేసి వచ్చే సంక్రాంతి వరకు బాలయ్య బాబు ఎలబోతున్నారని హీరో రాజశేఖర్ తెలిపారు. బాలయ్య బాబు సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందంటే అప్పట్లో ఇండస్ట్రీలో ఉన్న సినిమా హీరోల అందరికీ చెమటలు పట్టేవి కచ్చితంగా సంక్రాంతికి టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయం సాధించే హీరో ఎవరైనా ఉన్నారంటే అది బాలయ్య బాబు అని హీరో రాజశేఖర్ మాట్లాడుతూ సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: