బాలయ్య రూలర్ సినిమా డిసెంబర్ 20 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై నమ్మకాలూ ఉన్నాయి.  ఈరోజు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ను కూడా లాంచ్ చేశారు.  ట్రైలర్ లో బాలయ్య బాబు ఎనర్జీ చూస్తుంటే సినిమాకు తప్పకుండా ప్లస్ అవుతుందని అంటున్నారు.  కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య బాబు చేస్తున్న రెండో సినిమా ఇది.  


మొదటి సినిమా జైసింహా చేశారు.  పోయిన ఏడాది వచ్చిన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది.  ఆ తరువాత మరో సినిమా కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దర్శకుడు పరుచూరి మురళి కథను కళ్యాణ్ కు ఇవ్వడంతో కళ్యాణ్ ఈ సినిమాను మొదలుపెట్టాడు.  అయితే, ఒక దర్శకుడు అనుకున్న కథను మరొకరి ఇవ్వడం అంటే అది మాములు విషయం కాదు.  


త్యాగం చేయాలి.  పరుచూరి మురళి అదే చేశారు.  కళ్యాణ్ కు కథను ఇవ్వడం.. అదే కథతో దర్శకుడు కెఎస్ రవికుమార్ సినిమాను స్టార్ట్ చేయడం, ఐదు నెలలోపే సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగిపోయాయి.  మొదట సినిమాను సంక్రాంతికి అనుకున్నా, దానికంటే 20 రోజులు ముందుగానే సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు.  దానికి కారణం ఉన్నది.  సంక్రాంతికి థియేటర్లు దొరకడం కష్టం.  అందుకే డిసెంబర్ కు మార్చుకున్నారు.  


ఇక సినిమా బాగుందనే టాక్ వస్తే... సంక్రాంతి వరకు సినిమా ఆడుతుంది.  అంతకంటే కావాల్సింది ఏముంటుంది.  సినిమాకు మంచి టాక్ వచ్చింది అంటే... సినిమాకు పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చెయ్యడమే కాదు.. లాభాలు కూడా వచ్చేస్తాయి.  మరి రూలర్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తుందా లేదా అన్నది తెలియాలంటే మాత్రం ఈనెల 20 వ తేదీ వరకు ఆగాల్సిందే.  అదే రోజున ప్రతిరోజూ పండుగే, దబాంగ్ 3 సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: