ప్రస్తుతం యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న రూలర్ సినిమాపై అటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బాలకృష్ణ ఒక మాస్ పోలీస్ ఆఫీసర్ గా మరియు డాన్ గా రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలను ఈ సినిమాలో పోషిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. బాలకృష్ణ సరసన లెజెండ్ భామ సోనాల్ చౌహన్, మరియు వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటీమణి జయసుధ మరియు భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు కథ మరియు డైలాగులు పరుచూరి మురళి అందిస్తుండగా, ఫోటోగ్రఫిని రామ్ ప్రసాద్ అందిస్తున్నారు. 

 

హ్యాపీ మూవీస్, సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మాత సి కళ్యాణ్ అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి, శ్రోతల నుండి విశేషమైన స్పందనను రాబట్టడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ప్రస్తుతం విశాఖపట్నం లో జరుగుతోంది. బోయపాటి శ్రీను, జీవిత, రాజశేఖర్, అంబికా కృష్ణ సహా మరికొందరు సినీ ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణ పై పొగడ్తలు కురిపించారు. బాలకృష్ణ గారు తాను నటించే పాత్రను ఎంతో ఓన్ చేసుకుని మరీ నటిస్తారని, ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో సులభం అని చెప్పారు. అయితే బోయపాటి మాట్లాడుతుండగా, 

 

మధ్యలో మైక్ అందుకున్న నిర్మాత సి కళ్యాణ్ గారు, నిజానికి ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ ని బోయపాటి గారే సూచించారని అన్నారు. కాగా ఈ విషయమై బోయపాటి మాట్లాడుతూ, అవును కళ్యాణ్ గారు చెప్పేది నిజమే, టైటిల్ తో పాటు రూలర్ టైటిల్ కి తగ్గట్లు ఒక సాంగ్ కూడా కంపోజ్ చేయించాను, అయితే కేఎస్ రవికుమార్ గారితో చేస్తున్న ఈ సినిమాకు రూలర్ టైటిల్ సరిపోతుందని భావించి టైటిల్ వారికి సూచించానని అన్నారు. కాగా ఈ సినిమా ఈనెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: