బాలయ్య బాబు 105వ సినిమా రూలర్ ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో శనివారం సాయంత్రం జరిగింది. నందమూరి ఫ్యాన్స్ తో పాటుగా సిని ప్రేమికుల మధ్యలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా స్టేజ్ మీద బాలకృష్ణని పొగుడుతూ నిర్మాత సి.కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశాడు. బాలయ్య దాసరి కాంబో.. దాసరి 150వ సినిమా అలాంటి సినిమాకు నన్ను నిర్మాతగా ఎంపిక చేశాడు బాలయ్య.

 

ఇక రెండోసారి జై సింహాకు తనని నిర్మాతగా ఎంచుకున్నారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బాలయ్య సినిమా నిర్మించా అని అన్నారు సి కళ్యాణ్. ఈ సినిమా కోసం ప్రతి ఒక్క టెక్నిషియన్ బాగా కష్టపడ్డారని అన్నారు. ఇక ముఖ్యంగా బాలకృష్ణ డ్యాన్సుల గురించి ప్రస్థావించారు సి కళ్యాణ్. 

 

జై సింహాలో అమ్మ కుట్టి సాంగ్ ను మించి ఈ సినిమాలో బాలయ్య డ్యాన్సులు ఉంటాయని తెలుస్తుంది. సి కళ్యాణ్ ప్రత్యేకంగా చెప్పారు అంటే తప్పకుండా బాలయ్య బాబు రూలర్ లో ఫైట్లు, డైలాగులే కాదు డ్యాన్స్ కూడా దుమ్ము దులిపేశాడని అనిపిస్తుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ లో బాలయ్య బాబు డ్యాన్స్ అదరగొడుతున్నాడు. ఇక థియేటర్ లో బాలకృష్ణ డ్యాన్స్ కు నందమూరి ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదని చెప్పొచ్చు.

 

రూలర్ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపించనున్నాడు. సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తుండగా భూమిక కూడా స్పెషల్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నారు.  బాలయ్య రూలర్ తో పాటుగా సాయి ధరం తేజ్ ప్రతిరోజూ పండుగే సినిమా పోటీకి వస్తుంది. మారుతి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: