నందమూరి నటసింహం బాలకృష్ణ 105వ చిత్రంగా తెరకెక్కిన తాజా చిత్రం రూలర్.. కే ఎస్ రవి కుమార్ దర్శత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్ లు గా నటిస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో బాలయ్య తీసుకొచ్చిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ లో భాగంగా వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు బాలయ్య సినీ చరిత్రలో అతి పెద్ద డిజాస్టర్స్ మారాయి..

 


కొంతకాలం గ్యాప్ తీసుకున్న బాలయ్య సినిమాల కథల ఎంపిక లో చాలా జాగ్రత్తలు తీసుకొని మరి ఇప్పుడు నటిస్తున్న చిత్రం రూలర్.. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం లో నటిస్తున్నారు ఒక పాత్రలో డాన్ గా , మరో పాత్రలో పోలిసు గా నటిస్తున్నారు.. అయితే ఇప్పటివరకు ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్లు, పోస్టర్లు, సాంగ్స్ మరియు ట్రైలర్లకు జనాల నుండి మంది స్పందన వస్తుండటంతో సినిమాపై చిత్రయూనిట్ భారీ అంచనాలే పెట్టుకుంది..

 


అసలు విషయానికొస్తే.. రూలర్ సినిమాలో హీరోయిన్ లు గ్లామర్ తో ప్రేక్షకులను మరింత అకట్టుకుంటున్నారు.. ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రానికి వాల్ల అందమే ప్లస్ అని అంటున్నారు.. అంతేకాక ఈ చిత్రంలో బాలయ్య బాగా సన్నబడి మరి అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నారు.. మొత్తానికి సినిమా బాలయ్య కు హిట్ ను అందిస్తుందని అంటున్నారు.. మరి సినిమాలో సన్నివేశాలు కూడా బాగానే ఉండటంతో నందమూరి అభిమానులకు శుభవార్త అని చెప్పాలి..

 


తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విశాఖపట్నం లో జరిగింది.. ఈ ఈవెంట్ కు చిత్రయూనిట్ మరియు విశాఖలోని టీడీపీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు .. ఇక ఈ సినిమాలో నటిస్తున్న ముద్దుగుమ్మలు అందం ఈవెంట్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.. బాలయ్య చూడటానికి వచ్చిన అభిమానులు ముఖ్యంగా హీరోయిన్స్ చూడటానికి భారీగా తరలివచ్చారు.. జనం భారీగా రావడంతో అక్కడ తోపులాటలు జరిగాయి.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమా డిసెంబర్ 20 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సినిమా తర్వత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: