నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రూలర్‌. తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతీ ఏడాది సంక్రాంతి బరిలో సత్తా చాటే బాలయ్య ఈ సారి అభిమానులకు సంక్రాంతిని కాస్త ముందుగానే తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

 

బాలయ్య మార్క్‌ మాస్‌ కమర్షియల్ ఫార్ములాతో రూపొందిన రూలర్‌ ట్రైలర్ ఇటీవ‌లె విడుద‌లై అద్భుత‌మైన స్పంద‌న‌ను తెచ్చుకుంది.  కమర్షియల్‌ ఫార్మాట్‌లో రూపొందించిన ఈ ట్రైలర్‌లో బాలయ్య అభిమానులు ఏ ఏ అంశాలు ఆశిస్తారో అవన్ని పక్కాగా ఉండేలా ప్లాన్‌ చేశారు. బాలయ్య మార్క్‌ పంచ్‌ డైలాగ్‌లు హీరో ఎలివేషన్‌ యాక్షన్‌ ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్ చేశారు చిత్రయూనిట్‌. బాలకృష్ణ సరసన హాట్‌ బ్యూటీ సోనాల్‌ చౌహాన్‌, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్‌ రాజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో నిరాశపరిచిన బాలయ్య రూలర్‌లో అభిమానులను అలరించాలని ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ ప్యాకేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

 

ఇక ఈ చిత్రంలో బాల‌య్య రెండు వేరియేష‌న్స్‌లో క‌నిపిస్తున్నారు. రెండు గెట‌ప్‌ల‌లో బాల‌య్య త‌న ఫ్యాన్స్‌ను అల‌రించ‌నున్నారు. ఒక‌టి మాస్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌గా మ‌రొక‌టి కాస్త యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్‌గా బాల‌య్య క‌నిపించారు. ఈ గెట‌ప్స్‌తో బాల‌య్య ఈ చిత్రంల్ డ్యూయ‌ల్ రోల్ లో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో బాల‌య్య న‌టించిన డ్యూయ‌ల్ రోల్ చిత్రాలో లెజండ్‌, సింహా చిత్రాలు బాక్సీఫీస్ ముందు ప‌ర్వాలేద‌నిపించుకున్నాయి. ఇక మ‌రి ఈ మ‌ధ్య పెద్ద‌గా హిట్లు లేని బాలయ్యను ఈ డ్యుయ‌ల్ రోల్ ఏ మాత్రం గ‌ట్టెక్కిస్తుందో వేచి చూడాలి. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బాలయ్యతో గౌతమిపుత్ర శాతకర్ణి, జైసింహా సినిమాలకు పనిచేసిన సంగీత దర్శకుడు చిరంతన్‌ భట్ సంగీతమందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: