సినిమా అంటే పిచ్చి, వెర్రి, వ్యామోహం ఉండకూడదు అంటూ బాలయ్య మాట్లాడిన మాటలు అందరికీ విపరీతంగా నచ్చేశాయి. ఆడవాళ్ళ మీద జరుగుతున్న దాడుల గురించి కూడా చక్కగా మాట్లాడిన బాలయ్య .. నటన అనేది ఒక పరకాయ ప్రవేశం అని చెప్పుకొచ్చారు .. ఆత్మ యొక్క అనుభవాన్ని పుణికిపుచ్చుకోవాలి అని చెప్పుకొచ్చారు బాలయ్య.. మనల్ని మనం హెచ్చరించుకుంటూ ఉండాలి అని మాట్లాడారు బాలయ్య.. " నాకు ఎప్పటికీ నాన్న ఎన్‌టి‌ఆర్ గారే స్పూర్తి , తక్కువ టైమ్ లో సినిమా లు చెయ్యడం దగ్గర నుంచి కూడా అన్నీ విషయాల్లో ఆయన నాకు ఎప్పుడూ తోడు ఉన్నారు.

 

నా మొదటి సినిమా టైమ్ దగ్గర నుంచి మొన్న మా బోయపాటి గారి లెజెండ్ సినిమా వరకూ అన్నింటా నన్ను నడిపించే దైవం నాన్నగారే .. ఈ సినిమా కి సంగీతం ఇచ్చిన చిరంతన్ భట్  నాకు బాగా తెలుసు .. సభా పూర్వకంగా ఆయనకి నా అభినందనలు " అంటూ హిందీ పాట అందుకున్నారు బాలయ్య .. ప్రతి సారి కంటే కాస్త భిన్నంగా బాలయ్య స్పీచ్ అద్దిరిపోయింది అంటూ ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు .. " నేను ఎలాంటి ప్రయోగం చేసినా నన్ను జనం ఆదరిస్తారు .. సినిమా ఐనా రాజకీయం ఐనా నాతో అందరూ ఇమడలేరు .. నా దారి వేరు " అంటూ బాలయ్య చెప్పిన ప్రాస డైలాగులతో పాటు తెలుగు భాష , తెలుగు జాతి గురించి పద్యాలు చలోక్తులతో అదరగొట్టారు బాలయ్య .

 

రైతు మీద సినిమా తీయాలని ఎప్పటినుంచో ఉంది " అని చెప్పుకొచ్చారు బాలయ్య. అంతేకాకుండా వైజాగ్ సెంటిమెంట్ కూడా తన సినిమా కి కలిసి వస్తుంది అని చెబుతున్నారు బాలయ్య .. గతం లో చేసిన అనేక సినిమా లు వైజాగ్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నవి సూపర్ హిట్ లు గా నిలిచాయి అనీ ఇది కూడా హిట్ అవుతుంది అనే నమ్మకం ఉంది అంటున్నారు బాలయ్య ..

మరింత సమాచారం తెలుసుకోండి: