నందమూరి బాలకృష్ణ , కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రూలర్.. సరికొత్త లుక్ తో సరికొత్తగా రొమాన్స్ తో ఈ సినిమా రూపొందింది.. అయితే మాస్ ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూ వచ్చిన బాలయ్య, ఇప్పుడు కాస్త రూట్ మార్చాడు.. అందాల వైపు మొగ్గు చూపిన బుల్ బుల్ బాబు యువ హీరోలకు మించిన రొమాన్స్ ను ఈ సినిమాలో చూపించ బోతున్నాడు.. 

 

గతంలో చాలా సినిమాలలో రెండు పాత్రల్లో నటించిన ఈయన ఈ సినిమాలో కూడా  ద్విపాత్రాభినయం లో నటిస్తున్నారు ఒక పాత్రలో డాన్ గా , మరో పాత్రలో పోలిసు గా నటిస్తున్నారు.. అయితే ఇప్పటివరకు ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్లు, పోస్టర్లు, సాంగ్స్ మరియు ట్రైలర్లకు రెస్పాన్స్ రావడంతో సినిమా హిట్ పక్క అని చిత్రయూనిట్ నమ్ముతుంది.. మరి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం పాజిటివ్ టాక్ అందుతుంది.

 

విశాఖపట్నం లో  ఈ చిత్ర  ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.. ఈ ఈవెంట్ కు చిత్రయూనిట్ మరియు విశాఖలోని టీడీపీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు .. ఇక ఈ సినిమాలో నటిస్తున్న ముద్దుగుమ్మలు అందం ఈవెంట్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.. బాలయ్య చూడటానికి వచ్చిన అభిమానులు ముఖ్యంగా హీరోయిన్స్ చూడటానికి భారీగా తరలివచ్చారు.. మరో విషయమేంటంటే ఈ ఈవెంట్ లో బాలయ్య హిందీలో ఓ పాట పాడాడు..ఆయన పాట ఈవెంట్ లో మరింత జోష్ పెంచింది..


 అసలు మ్యాటరెంటి అంటే... ఈవెంట్ ముగిసే వరకు కూడా హీరోయిన్లు వదల్లేదు.. నారీ నారీ నడుమ మురారి అన్నట్లు బాలయ్య ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య గోపాలకృష్ణ గా మెరిశాడు.. ఎంతైనా కూడా అందం అక్కడ ఉంటే ఉంటారని బాలయ్య సై అంటున్నారు. ఈవెంట్ ఫుల్ జోష్ తో మొదలైంది.. అంతకు మించిన జోష్ తో ముగిసింది.. మొత్తానికి బాలయ్య కాస్త రొమాంటిక్ యాక్షన్ కోణంలో అదిరిపోయేలా ఉంది. మరి సినిమా ఈ విధంగా ఉండబోతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: