విశాఖపట్నం వేదికగా నందమూరి బాలయ్య బాబు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో నటించిన ‘రూలర్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది బాలయ్య బాబు అభిమానులు భారీగా హాజరవడం జరిగింది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత మరియు అదే విధంగా ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మొదటిసారి బాలకృష్ణ నటించిన సినిమా విడుదల కావడం తో ఉత్తరాంధ్ర లో ఉన్న చాలామంది ప్రజలు విశాఖ నగరానికి ‘రూలర్’  ప్రీ రిలీజ్ వేడుకకు కోసం భారీగా హాజరయ్యారు.

 

ముఖ్యంగా సినిమాకి వచ్చిన అతిరథమహారధులు ‘రూలర్’ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికపై బాలయ్య బాబు స్లిమ్ అవడానికి గల కారణాలను ఆయన ఏం చేసి ఆ విధంగా చాలా అందంగా ఆ వయసులో కూడా కనిపించటం జరిగిందో దానికి గల రహస్యాన్ని చెప్పాలంటూ చాలా మంది బాలయ్య బాబు సినిమాలో ఉన్న లుక్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఈ వేడుకకు రాజశేఖర్ మరియు ఆయన భార్య జీవితా రాజశేఖర్ హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ తనని ఇండస్ట్రీలో మొదటినుండి సపోర్ట్ చేస్తూ అండగా నిలబడింది బాలయ్య బాబు అని … చిన్ననాటి నుండే బాలయ్య బాబు రూలర్ అని ఆయన తండ్రి మరియు ఆయన వియ్యంకుడు చంద్రబాబు కూడా రూలర్స్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

 

తర్వాత మాట్లాడిన జీవిత రాజశేఖర్ ఎలాంటి కల్మషం లేని వ్యక్తి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే తత్వం గల బాలకృష్ణ ని చూస్తే చిన్న పిల్లవాడు గుర్తుకు వస్తాడు అని " బాలకృష్ణ చిన్న పిల్లాడు లాంటోడు " అని జీవిత రాజశేఖర్ అనగానే వేదిక ముందు ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా గోల చేయడంతో వైజాగ్ నగరం దద్దరిల్లి నట్లయింది. దీంతో జీవిత రాజశేఖర్ బాలయ్య బాబు ఎటువంటి కల్మషం లేని వ్యక్తి అని పొగడ్తల వర్షం కురిపించి ...రూలర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: