ఎప్పుడు ఏదొక వివాదంలో ఉంటె తప్ప ఆయనకు నిద్ర రాదు.. ముద్ద దిగదు. అలాంటి వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇలా ఎప్పుడు ఏదోక వివాదంలో మునిగి తేలే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మొన్న ఈ మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సీనియర్ ఎన్టీఆర్ బయో పిక్ తీసి చంద్రబాబుని భయపెట్టిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరో చిత్రంతో చంద్రబాబు నాయుడుని భయపెట్టాడు. 

 

అదే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. సారీ సారీ.. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం. ప్రస్తుత రాజకీయాలపై అంటూ ఈ సినిమా తీసాడు. అయితే ఈ సినిమా చుసిన రాజకీయ అభిమానులకు అసలు నచ్చలేదు... అది కామెడీ సినిమా అయినప్పటికీ వారు సంచలనమైం పోస్టర్ ని చేసి రామ్ గోపాల్ వర్మ మరణించినట్టు వార్త సృష్టించారు. 

 

పోస్టర్ లో ఇలా ఉంది.. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా రిలీజ్ రోజు అనగా డిసెంబర్ 12న వర్మ చనిపోయాడని.. డిసెంబర్ 26న ఆయన పెద కర్మ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 'నీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు కలిగించాలని నీ ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లో శాంతి చేకూరకూడదని భవవంతున్ని ప్రార్ధిస్తూ జనసేన యూత్- కోడూరు పాడు' అంటూ భారీ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జోహార్ బాస్టర్డ్ అంటూ వర్మను ఏకిపారేశారు జనసైనికులు.

 

దీంతో ఈ పోస్టర్ చుసిన రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. 'దయచేసి అర్ధం చేసుకోండి.. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా జస్ట్ ఫన్ కోసం మాత్రమే తీశా. నేను గాడ్ ప్రామిస్‌గా చెప్తున్నా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ బాబులను ప్రేమిస్తున్నా. వాళ్ల ఫాలోవర్స్ మీద ఒట్టు.. ముఖ్యంగా కోడూరుపాడు జనసేన ఫాలోవర్స్‌ మీద ఒట్టేసి చెబుతున్నా నమ్మండి' అంటూ సెటైరికల్ ట్విట్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: