కెరియర్ లో 'జై సింహా' లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో తాజాగా 'రూలర్' అనే సినిమా బాలయ్య బాబు చేయడం జరిగింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక విశాఖపట్నం వేదికగా చాలా గ్రాండ్ గా జరిగింది. డిసెంబర్ 20వ తారీఖున సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో జరిగిన ఈ ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్య కెరీర్ లో రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ బాలయ్య ని పొగడ్తలతో ముంచెత్తారు.

 

అంతేకాకుండా ఉత్తరాంధ్ర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ… ఈ ప్రాంతపు ప్రజలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఎంతటి తుఫానులనైనా ఎదుర్కొనే శక్తి కేవలం మీకే ఉంటుంది. అంతేకాకుండా నేను ఎటువంటి సినిమా తీసిన వైజాగ్ నగరం లో షూటింగ్ చేయాలని కచ్చితంగా ట్రై చేస్తాను అని బోయపాటి తెలిపారు. బాలకృష్ణకి రూలర్ అనే టైటిల్ బాగా సరిపోతుంది. ఎందుకంటే బాలయ్య రూలర్ ఆఫ్ ది ఆర్ట్స్, రూలర్ ఆఫ్ ది హార్ట్స్. బాలయ్య ఓ పాత్ర కోసం కమిటయ్యారు అంటే ఆ పాత్ర కోసం ఆయనే శిరస్సు వంచుతారు.

 

ఒకసారి ఆ పాత్రలో లీనమయ్యాక ఆ పాత్రే బాలయ్య ముందు మోకరిల్లుతుంది అని బోయపాటి అన్నారు. ఇక అభిమానులకు ఏమైనా జరిగితే ఆ టైంలో ముందుండే ఆదుకునే హీరో ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే బాలయ్యబాబు అని.. తన ముందు ఎవరైనా ఏడిస్తే వారి కన్నీటిని తుడిచి వారి బాధను తీర్చి ఆదుకుంటారని ఇందుమూలంగా నే బాలయ్య బాబు రూలర్ ఆఫ్ ది ఆర్ట్స్, రూలర్ ఆఫ్ ది హార్ట్స్ అని బోయపాటి అన్నారు. కచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు బోయపాటి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: