నాచురల్ స్టార్ నాని సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. నాని చేసిన సినిమాలన్నీ బాగానే విజయం సాధించాయి.. ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతావన్నీ బాగానే ఆడాయి. సినిమా హిట్ అయిందా లేక ప్లాప్ అయిందా అన్నది ఆలోచించకుండా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు..

 

కాని ఈ మధ్య నాని కి ఒక హిట్ ఒక ప్లాప్ సినిమాలు వస్తున్నాయి.. అందుకే సినిమాల ఎంపిక విషయం లో చాలా జాగ్రత్త పడుతున్నాడు. 'జెర్సీ' మూవీ విజయం తర్వాత నాని 'గ్యాంగ్ లీడర్' సినిమా ని విడుదల చేసాడు.. కాని ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు.. రివేంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. నాని ఫ్యాన్స్ డీలా పడ్డారు.

 

ఈ క్రమంలోనే నాని బాగా అలోచించి ఒక ప్రయోగానికి సిద్ధం అయ్యాడని ఓ వార్త వెలువడింది. గ్యాంగ్ లీడర్ సినిమా కంటే ముందే నాని " V" అనే సినిమా ని మొదలుపెట్టాడు. 'ఇంద్రగంటి మోహన్ కృష్ణ' తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో వీల్లద్దరికి జంటగా నివేదా థామస్, అతిధి రావు హైదరి నటిస్తున్నారని సమాచారం. సినిమాకి సంబంధిచిన ఘాటింగ్ కొంత భాగం పూర్తయింది.



‘V' సినిమా షూటింగ్ ప్రారంభం అయిన సమయంలో నాని ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశాడు. ‘నన్ను హీరోగా పరిచయం చేసింది ఈయనే. ఈరోజు నా 25వ సినిమానూ డైరెక్ట్ చేస్తున్నాడు. కానీ, ఈ సారి కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాం'  అని  అందులో పేర్కొన్నాడు. దీంతో ఈ సినిమాలో నాని సైకో కిల్లర్‌గా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

సినిమా పై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నాని విలన్ గా నటించబోతున్నారట అన్న విషయం నిజమే.. కాని అన్ని సినిమాల్లో లాగా చెడ్డ విలన్ కాదట...ఒకానొక సందర్భంలో ఒక మంచి పని గుర్చి విలన్ లా మారతాడట. అందుకే నాని మంచి విలన్ అన్నమాట.. సినిమాల్లో విలన్ అంటే చెడ్డ వ్యక్తి అని అనుకుంటాము..

 

కాని ఈ సినిమాలో విలన్ మాత్రం మంచివాడు. తక్కువ బడ్జెట్ తో వచ్చే సినిమా అయిన గాని సినిమా లుక్ మాత్రం రిచ్ గా ఉంటుందట... సుదీర్ బాబు మరియు నాని ల మధ్య ఛేజింగ్, ఫైటింగ్ సన్నివేశాలు ధూమ్ సినిమా మాదిరిగా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాలో హీరోనే విలన్ పాత్ర చేస్తున్నాడు.. ఈ మూవీ అయిన నాని కి మంచి  హిట్ తెస్తుందేమో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: