డిసెంబర్ 31న రాత్రి 9:30 గంటలకు ఈటీవీ లో 'ఆడవారి పార్టీ లకి అర్థాలే వేరులే' అనే న్యూ ఇయర్ కార్యక్రమం ప్రసారం అవ్వబోతుంది. అయితే దీనికి సంబంధించిన ప్రోమో 2 రిలీజ్ అయ్యి ఆసక్తిని రేపుతోంది. ప్రోమో ఆరంభంలోనే యాంకర్ వర్షిణి బంతి పువ్వు రంగు డ్రెస్స్ లో కనిపించి ఆకట్టుకుంది. ఆ తర్వాత హైపర్ ఆది సూట్ లో తళుక్కుమన్నాడు. సో, ఈ ఈవెంట్ కు వారిద్దరు హోస్ట్ లుగా వ్యవరిస్తున్నారని తెలుస్తుంది. ఆపై రోజా సూపర్ డాన్స్ స్టెప్పులు వేసి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. న్యూ ఇయర్ ఈవెంట్ లో సీనియర్ ఆర్టిస్టులు అన్నపూర్ణమ్మ, వై.విజయ, కరాటే కళ్యాణి, తదితరులు కూడా సందడి చేయనున్నారు.

ప్రోమోలో భాగంగా... వర్షిణి ఆదిని ఇలా ...'ఏంటీ, అమ్మాయిల పార్టీకి నిన్నెందుకు పిలిచానని ఆలోచిస్తున్నావా?' అని ప్రశ్నిస్తుంది. 'లేదు, అమ్మాయిల పార్టీ అని చెప్పి.. నువ్వెందుకున్నావా అని ఆలోచిస్తున్న' అని పంచ్ వేస్తాడు ఆది.

దీంతో అలిగిన వర్షిణి... 'ఆది ఒళ్ళు ఎలాగుంది' అంటుంది. 'జనవరి వచ్చింది కదా?చల్లగా ఉంది' అని ఆది ఛలోక్తిని విసురుతాడు.

ఇక ఆది పంచులకు కౌంటర్ ఇవ్వలేక..' నిన్ను కేవలం ఇక్కడ పనులు చేయడం కోసమే పిలిపించా' అని వర్షిణి చెబుతుంది. అప్పుడు, ఆది మాట్లాడుతూ... 'మీరు తాగేసిన తర్వాత గ్లాసులు ఎత్తివేస్తా, తినేసిన తర్వాత ప్లేటులు ఎతేస్తా, మీరు పడుకున్న తర్వాత మిమల్ని ఎతేస్తా' అని అనగానే వర్షిణి కోపంగా చూస్తుంది.

ఆ సందర్భంలోనే.. ఎక్కువ చేస్తే నిన్ను ఎతేస్తానని ఆది తో వర్షిణి అంటుంది. అవునా? ఏది ఎత్తేయి చూద్దాం అని ఆది సవాల్ విసురుతాడు.

అభి దేఖ్ అంటూ... నిజంగానే వర్షిణి ఆదిని అమాంతం ఎత్తుకొని తన బిగికౌగిలిలో 3 సెకనుల పాటు బంధిస్తుంది. ఆ మూడు సెకనుల పాటు ఆది కొంటెగా ఎక్సప్రెషన్స్ ఇస్తూ ఎంజాయ్ చేస్తాడు. దాంతో ఈవెంట్ షో లో ఉన్నవారు... బిగ్గరగా అరుస్తారు. తరువాత ఆదిని కిందకి దించుతుంది వర్షిణి. చూసావా నిన్ను నేను ఎత్తేసా! ఇప్పుడేమంటావ్ అని వర్షిణి ప్రశ్నించగా... ఇంకోసారి ఎత్తితే బాగుంది అని అంటనని ఆది ఆశగా ఆమెవైపు చూస్తాడు. దీంతో ఆమె.. ఆది యొక్క అంతరార్థం తెలుసుకొని సిగ్గు పడుతుంది. ఇకపోతే, ఇటీవల పటాస్ షో లో ఆడియన్స్ లో ఓ అబ్బాయి బుగ్గకొరికి.. ఇప్పుడు ఆదిని ఏకంగా ఎత్తుకొని మరోసారి షాక్ ఇచ్చింది వర్షిణి. ఇవన్నీ వీక్షిస్తున్న నెటిజన్లు మాత్రం.. వర్షిణి బాగా రెచ్చిపోతుందని చర్చించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: