తిరుగులేని తెలుగు సాహితీవేత్త.. రచయిత ప్రముఖ నటుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గిల్లపూడి  మారుతీ రావు ఈ లోకాన్ని విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గొల్లపూడి మారుతీ రావు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఒక్కసారిగా తెలుగు చిత్రపరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. గొప్ప నటుడు రచయిత అయినా గొల్లపూడి మారుతి రావు మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అంటూ పలువురు సిని రాజకీయ ప్రముఖులు గొల్లపూడి మృతి కి నివాళులు అర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు గొల్లపూడి మారుతి రావు దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన నటుడు అని అలాంటి వ్యక్తి చిత్ర పరిశ్రమకు దూరం కావడం నిజంగా బాధాకరమని... ఆయన మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ మూగబోయింది అంటూ పలువురు గొల్లపూడి మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

 

 

 కాగా తెలుగు చిత్ర పరిశ్రమకు సినిమాల రచయితగా పరిచయమైన గొల్లపూడి మారుతీరావు.. ఎన్నో సినిమాలకు కథలను రాసి ఉత్తమ రచయితగా ఎన్నో అవార్డులు అందుకున్నారు గొల్లపూడి మారుతీరావు. ఇక ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్గా గొల్లపూడి మారుతీరావు కళామతల్లికి చేసిన సేవలు మరువలేనివి. అయితే అనారోగ్యంతో బాధపడుతూ గొల్లపూడి మారుతీరావు చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. కాగా గొల్లపూడి మనవడు మనవరాలు విదేశాల నుంచి రావాల్సి ఉండడంతో ఆయన అంత్యక్రియలు ఆదివారం జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అందువల్ల గొల్లపూడి భౌతికకాయాన్ని శనివారం మధ్యాహ్నం వరకు ఆసుపత్రి మార్చురీలోనే ఉంచాల్సి వచ్చింది. 

 

 

 

 మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు గొల్లపూడి మారుతి రావు భౌతిక కాయాన్ని చెన్నైలోని టీ నగర్ శారదాంబల్  వీధిలోని  ఆయన ఇంటికి తీసుకొచ్చి... ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు చిరంజీవి సుహాసిని భానుచందర్ సంగీతం శ్రీనివాసరావు రాజీవ్ మీనన్ కాట్రగడ్డ మురారి సావిత్రి కుమార్తె చాముండేశ్వరి సహా చాలా మంది సినీ ప్రముఖులు గొల్లపూడి మృతదేహానికి  నివాళులు అర్పించారు. గొల్లపూడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా నేడు ఉదయం 11 గంటలకు టీ నగర్ లోని కన్నమ్మ పేట స్మశానవాటికలో గొల్లపూడి మారుతీ రావు అంత్యక్రియలు జరగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: