నందమూరి నటింహం బాలకృష్ణ 105 వ చిత్రంగా తెరకెక్కిన చిత్రం రూలర్.. దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్  రొమాంటిక్ కమర్షియల్ చిత్రం ఈ రూలర్. ఇటీవల ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ , టీజర్లు, సాంగ్స్ మరియు థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లోను, సినీ ఇండస్ట్రీలోను, అటు నందమూరి అభిమానుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. 


గతంలో బాలకృష్ణ మరియు కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన జైసింహా సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన జోడిగా సోనాల్ చౌహాన్,వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో సీనియర్ నటి జయసుధ, భూమిక చావ్లా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని నిర్మాత సి.కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 


కాగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించి సినిమాని క్రిస్మస్ కానుక గా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు సాయంత్రం ఈ చిత్ర బృందం విశాఖలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. అతిరథ మహారథుల మద్య అభిమానుల మధ్య సాగిన ఈ ఈవెంట్ సినిమా స్థాయిని మరింత పెంచుతుందని అర్థమవుతుంది..


ఇక్కడే ఒక సంఘటన జరిగింది.. ఈవెంట్ జరుగుతున్నంత సేపు బాలయ్య అరుపులు, కేకలతో అభిమానుల కన్న ఎక్కువగా అరుస్తూ ఉన్న బాలయ్య ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడకి వచ్చిన అభిమానుల జోరును మరింత పెంచడానికి బాలయ్య కొంచం రెచ్చిపోయి ప్రవర్తించారు..దాంతో షో మరింత జోష్ ఫుల్ గా సాగింది.. ఎది ఏమైనా సినిమా హిట్ కోసం బాలయ్య బలే చేస్తున్నాడు.. మరి సినిమా ఈ రేంజులో హిట్ అవుతుందో  చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: