టాలీవుడ్‌లో ఎక్కువ‌శాతం హీరోల ఫ్యామిలీస్ నుంచి వారి వార‌సులుగా ఇండ‌స్ట్రీకి వాళ్ళ కొడుకులు వ‌చ్చి స‌క్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ, కూతుళ్ళు వ‌చ్చి స‌క్సెస్ అయిన వాళ్ళు చాలా త‌క్కువ. ఇక ఈ విష‌యానికి వ‌స్తే కృష్ణ కూతురు మంజుల వ‌చ్చి రెండు మూడు చిత్రాల్లో న‌టించింది కానీ పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు.  ముఖ్యంగా అభిమానులు వారసురాళ్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడాన్ని అసలు అంగీకరించరు. అయినా అడపాదడపా స్టార్‌ వారసురాళ్లు ఇండస్ట్రీలో సందడి చేస్తూనే ఉన్నారు. త‌రువాత మంచు ల‌క్ష్మీ కూడా ఏవో టీవీ షోలు అవి చేస్తూ రెండు మూడు చిత్రాల్లో న‌టించి హ‌డావుడి చేసింది కానీ అంత స‌క్సెస్‌లు అయితే ఏమీ లేవు. ఇక ఇటీవ‌లె మ‌హేష్‌బాబు అక్క గంటా ప‌ద్మ అమ‌ర్‌రాజా ఎంట‌ర్ టైన్మెంట్స్‌తో త‌న కొడుకును హీరోగా లాంచ్ చేశారు. ఇక వీళ్ళు ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి. 

 

ఇక మెగాస్టార్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది సుష్మిత. చిరు పెద్ద కూతురైన సుష్మిత ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసింది. అందుకే చిరు తన సినిమాలకు కూతురినే డిజైనర్‌గా తీసుకున్నాడు. చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్‌ 150తో పాటు రంగస్థలం, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలకు డిజైనర్‌గా పనిచేసింది సుష్మిత. త‌ను చేసింది తక్కువ సినిమాలే అయినా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మంచి పేరు తెచ్చుకుంది.


ఇప్పటికే డిజైనర్‌గా మంచి పేరును సంపాదించిన‌ సుష్మిత తాజాగా మరో రంగంలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉందట. త్వరలో తాను సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించే ఆలోచనలో ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్‌, నాగబాబు, రామ్‌ చరణ్‌లకు సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి సుష్మిత కూడా అడుగుపెట్టనుందన్న టాక్‌ వినిపిస్తోంది.

 

అయితే దీనికోసం కాస్త భారీగానే ప్లాన్ చేస్తుంద‌ట‌. ముందుగా చిన్న చిన్న వెబ్ సిరీస్ తో మొద‌లు పెట్టి ఆ త‌రువాత సినిమాలు నిర్మించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇక ఆల్రెడీ ప‌ని కూడా మొద‌లుపెట్టేసింద‌ట‌. దానికి సంబంధించిన క‌థ‌లు వింటూ. అందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్‌ వర్క్‌ కూడా ప్రారంభించిందన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే సుష్మిత బ్యానర్‌ ఎప్పుడు లాంచ్‌ చేస్తుందన్న విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. 


ఇక ఈ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన నిర్మాత‌ల గురించి చూసుకుంటే మెగాస్టార్‌ వారసుడిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన రామ్‌ చరణ్‌ ఘనవిజయం సాధించాడు. తండ్రి రీ ఎంట్రీ సినిమా కోసం నిర్మాతగా మారిన చరణ్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌ను స్థాపించాడు. ఆ బ్యానర్‌లో తొలి సినిమాగా ఖైదీ నంబర్‌ 150 సినిమాను తెరకెక్కించి సూపర్‌ హిట్ అందుకున్నాడు. తరువాత రెండో సినిమాగా సైరా నరసింహారెడ్డిలాంటి భారీ ప్రాజెక్ట్‌ను రూపొందించాడు ఈ సినిమా కమర్షియల్‌గా నిరాశపరిచినా నిర్మాతగా చరణ్‌కు మంచి పేరు తీసుకువచ్చింది.

 

ఇక‌ నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేకపోయినా వెబ్‌ సిరీస్‌లతో ఆకట్టుకుంటుంది. తానే స్వయంగా నిర్మాతగా మారి పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌లు మంచి విజయం సాధించాయి. ఇక మ‌రి సుస్మిత ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: