టాలీవుడ్ నటి, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  బోల్డ్ బ్యూటీ రష్మీ గౌతమ్ మత్తెక్కించే కాస్ట్యూమ్స్‌తో గమ్మత్తైన మాటలతో కుర్రాళ్ల గుండెల్ని గిలిగింతలు పెట్టిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెటిజన్లతో పంచుకుంటూనే ఉంటుంది ఈ బ్యూటీ. అయితే రష్మి గౌతమ్ ఎక్కడికి వెళ్లినా.. ఆమెను సుడిగాలి సుధీర్ గురించే ఎక్కువగా అడుగుతుంటారు. సుధీర్, రష్మిల జంటకు ఫ్యాన్స్ మామూలుగా లేరు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు. 

 

కానీ వారిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. మ‌రో విషయం ఏంటంటే.. రష్మి అని గూగుల్‌లో ఎక్కడ సెర్చ్ చేసినా వెంటనే ఆ తర్వాత కనిపించే పేరు సుడిగాలి సుధీర్. ఇదిలా ఉంటే.. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న‌ రష్మి కేవలం యాంకర్‌గానే కాకుండా వెండితెరపై హీరోయిన్‌గానూ ప్రయత్నిస్తుంది. ఇక ఇప్పటి వరకు 20కి పైగా సినిమాల్లో నటించినా రష్మి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ.. జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక తాజాగా అందాల యాంకర్‌ రష్మీ గౌతమ్‌ అనంతపురంలో తళుక్కుమంది. 

 

ఓ షాపింగ్‌ మాల్‌ ను ప్రారంభించడానికి వెళ్లిన ఆమెను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీలు దిగడానికి, కరచాలనం చేయడానికి అభిమానులు ఎగబడ్డారు. షాపింగ్ మాల్‌లో దీపాన్ని వెలిగించిన రష్మీ అనంతరం అభిమానులతో  సెల్ఫీలకు పోజులిచ్చింది. జబర్దస్త్‌ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న‌ రష్మీని ఈ మ‌ధ్య కాలంలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ ఎక్కువ‌గా ఆహ్వానిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ర‌ష్మీ ఇటీవలే వైజాగ్, విజయనగరం వంటి ప్రాంతాల్లోనూ  షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. ఏదైమైన వ్యాపారులు ర‌ష్మీకి ఉన్న క్రేజ్ బాగానే ఉప‌యోగించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: