విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించిన మల్టీస్టారర్ సినిమా.. వెంకీ మామ. నిజ జీవితంలో మామా అల్లుళ్లు అయిన వీరిద్దరు వెండితెరపైనా మామా అల్లుళ్లుగా నటించారు.  సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్. రవీంద్ర దర్శకత్వం వహించాడు. ఇందులో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్ నటించగా, నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా కనిపించింది.  ‘ప్రేమమ్’ సినిమాలో కాసేపు మామా అల్లుళ్లుగా వెండితెరపై అలరించిన వీళ్లిద్దరు ఇపుడు పూర్తిస్థాయిలో ‘వెంకీమామ’గా పలరించారు. 

 

ఇక అబౌ యావరేజ్ టాక్ తెచ్చుకున్న వెంకీ మామ కాంబినేషన్ పరంగా క్రేజ్ ఉండటంతో తొలిరోజు కలెక్షన్లలో దుమ్ము లేపింది. ముఖ్యంగా చాలా చోట్ల ఈ చిత్రం సంచలన వసూళ్లు తీసుకొచ్చింది. వెంకీమామ మొదటి రోజు సుమారు 7.16 కోట్ల షేర్ ని సాధించింది స‌త్తా చాటింది.దీంతో అటు నాగ చైతన్య.. ఇటు వెంకటేష్ కెరీర్‌లో హైయ్యస్ట్ ఓపెనింగ్ డే వసూళ్లు తీసుకొచ్చింది వెంకీ మామ. ఇక ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం మొద‌టి రోజు, రెండో కూడా దుమ్ము దులిపేస్తున్నాయి. 

 

వాస్త‌వానికి రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు స్టార్లు నటించిన సినిమా కావడంతో ‘వెంకీ మామ'పై మొదటి నుంచీ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీంతో ఈ సినిమాను చూడాలని చాలా మంది అనుకున్నారు. ఇదే తమకు ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ కూడా భావించింది. ఇక రెండో రోజు క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. మొత్తంగా 5.01కోట్ల షేర్ తో మామా అల్లుళ్లు బాక్సాఫీస్‌ను బాగానే షేక్ చేసారు.

 

‘వెంకీ మామ’ రెండు రోజుల ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్ వివరాలు:

 

నైజాం- 4.46 కోట్లు

 

సీడెడ్- 2.26 కోట్లు

 

గుంటూరు - 1.1 కోట్లు

 

ఉత్తరాంధ్ర -   1.57 కోట్లు

 

తూర్పు గోదావరి- 1.05 కోట్లు

 

పశ్చిమ గోదావరి- 0.60 కోట్లు

 

కృష్ణా- 0.69 కోట్లు

 

నెల్లూరు- 0.44 కోట్లు


------------------------------------------------------------
రెండు రోజుల మొత్తం షేర్-12.17 కోట్లు
------------------------------------------------------------

 

మరింత సమాచారం తెలుసుకోండి: