జబర్దస్త్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా... అందాల భామగా  యాంకర్ అనసూయకు మంచి పేరు ఉంది. జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తూ తన వాక్చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులందరూ మతిపోగొట్టే అనసూయ... అటు సినిమాల్లో కూడా తనదైన నటనతో అలరిస్తున్న ఉంటుంది. అయితే అందాల ఆరబోతలో కూడా ఈ అమ్మడు ఎక్కడ తక్కువ కాదండోయ్.. అందాల ఆరబోతతో ఎంతో మంది ప్రేక్షకుల మతి పోగొట్టింది కూడా...అయితే అనసూయ కు బాగా పేరు తెచ్చి పెట్టిన పాత్ర ఏదైనా ఉందంటే అది రంగస్థలం సినిమాలో రంగమ్మ పాత్ర . ఈ సినిమాలో అనసూయ నటనకుగాను ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే ఈ అమ్మడికి పెళ్లయి ఏళ్లు గడిచిపోతున్న... ఇప్పటికీ ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఈ అమ్మడి అందం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఫిట్నెస్ విషయంలో కానీ కాస్ట్యూమ్స్ విషయంలో కానీ ఈ అమ్మడుకు ఎవరు సాటిలేరు అనే చెప్పాలి. ఓ వైపు సినిమా అవకాశాలు దక్కించుకుంటూనే  మరోవైపు జబర్దస్త్ లో యాంకరింగ్ తో అదరగొడుతుంది ఈ అమ్మడు . 

 

 

 

 అయితే ఇప్పటికీ తాను అందంగా కనిపించడానికి... అందర్ని ఆకర్షించటానికి.. డిఫరెంట్ కాస్ట్యూమ్ లో మరిచిపోవడానికి కారణం ఓ వ్యక్తి అని చెబుతోంది ఈ అమ్మడు.  మామూలుగా అయితే తన పర్సనల్ విషయాలు  ఎవరితో పంచుకోడానికి ఇష్టపడుతూ అనసూయ. అయితే తనను అంత అందంగా చూపిస్తూ.. అందరిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా కనిపించేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది ఎవరు అన్న ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఇకపోతే  అనసూయను క్రియేటివ్గా ఎప్పుడూ కొత్తగా చూపించే అమ్మాయి ఎవరో కాదు గౌరీ నాయుడు. ఈమె సెలబ్రిటీల ఫ్యాషన్ స్టైలిస్ట్ . 

 

 

 

 అయితే కాస్ట్యూమ్ డిజైనర్ అయిన 29 ఏళ్ల యువతి... టాలీవుడ్ లో చాలా తెలుగు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది . మెగా డాటర్ నిహారిక లీడ్ రోల్లో నటించిన ఒక మనసుకు సినిమాలో నిహారిక కొణిదెల కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసి అందంగా చూపించింది ఈ అమ్మడు. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి రి ఎంట్రీ  సినిమా ఖైదీ నెంబర్ 150 లో కూడా మెగాస్టార్ చిరంజీవికి అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిసైనర్ గా  కూడా పని చేసింది గౌరీ నాయుడు. అంతేకాకుండా రామ్ చరణ్ సినీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన రంగస్థలం సినిమాకి కూడా హీరో రామ్ చరణ్ కి అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేసింది. ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్ట్ లలో కూడా ఈ అమ్మడి పని చేస్తున్నట్లు సమాచారం. అనసూయ ఇప్పటికీ తాను అంత అందంగా కనిపించడానికి కాస్ట్యూమ్ డిజైనర్ గౌరీ నాయుడు కారణం అని చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: