తెలుగులో సినిమాలకు క్రేజ్ అనేది ఎప్పటికి తగ్గదు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు ఎక్కువగా ఉన్న జోనర్ తెలుగు... దీనితో సినిమాలకు కొదవే ఉండదు. అయితే అభిమానుల కోరికల్లో మాత్రం క్రమంగా మార్పులు వస్తున్నాయి. బాలివుడ్, హాలీవుడ్ సినిమాలు చూసి ఇక్కడ కూడా ఆ విధంగా సినిమాలు రావాలి అని కోరుకోవడం మొదలుపెట్టారు. యుట్యూబ్ లో సినిమాలు చూసి సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు... దీనితో విషయం తెలుసుకున్న దర్శక నిర్మాతలు ఆ విధంగా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు.

 

ఈ క్రమంలోనే కొన్ని సినిమాల్లో స్కిన్ షో అనేది ఎక్కువైంది. బాలివుడ్ లో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చేస్తే తప్పు ఏంటి అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీనితో దర్శకులు హీరోయిన్లను స్కిన్ షో చెయ్యాలని కోరుతున్నారట. దీనికి ముందు ఓకే చెప్పిన హీరోయిన్లు... ఇప్పుడు మాత్రం అందుకు ఇష్టపడటం లేదని తెలుస్తుంది. మాస్ ప్రేక్షకులు ఉన్నా సరే వారిలో అందరూ స్కిన్ షో కోరుకోవడం లేదని, స్కిన్ షో చేసిన హీరోయిన్ ని చులకనగా చూస్తున్నారని అభిప్రాయం హీరోయిన్ల‌లో ఉంద‌ట‌.

 

ఒక‌ప్పటిలా ఇప్పుడు స్కిన్ షోలు, ఎక్స్‌పోజింగ్ కోరుకునే వాళ్ల సంఖ్య రోజు రోజుకు త‌గ్గుతోంది. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ సంఖ్య పెర‌గ‌డంతో కూడా ఈ త‌ర‌హా సీన్లకు కాలం చెల్లుతోంది. ఇక ఇక్కడ రివ్యూలు కూడా ఎక్కువగానే వస్తున్నాయని, ఆ రివ్యుల్లో హీరోయిన్ స్కిన్ షో మీద కాస్త అసభ్యంగా కూడా రాతలు ఉంటున్నాయని ఇష్టపడటం లేదట.

 

అదే విధంగా ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో అత్యాచారాలు పెరగడానికి హీరోయిన్లు కూడా కారణమనే అభిప్రాయం ఎక్కువగా వినపడుతుంది. వాళ్ళు కుర్రాళ్ళను రెచ్చగొడుతున్నారని సోషల్ మీడియాలో, పలు చర్చా వేదికల్లో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. భావ ప్రకటన విషయంలో మొహమాటం చూపని తెలుగు వాళ్ళ దెబ్బకు హీరోయిన్లు భయపడిపోయారు. అందుకే స్కిన్ చేయమని చెప్తున్నారట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: